Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Mohsin Naqvi Leaves Stadium Ind Vs Pak T20 World Cup Pcb Chairman Viral Video

Mohsin Naqvi: సొంత దేశం అభిమానుల నుంచే థ్రెట్..? మ్యాచ్ మధ్యలోనే పీసీబీ బాస్ నఖ్వీ పరార్ (వీడియో)

Published Date :February 16, 2026 , 4:48 pm
By RAMAKRISHNA KENCHE
Mohsin Naqvi: సొంత దేశం అభిమానుల నుంచే థ్రెట్..? మ్యాచ్ మధ్యలోనే పీసీబీ బాస్ నఖ్వీ పరార్ (వీడియో)
  • Follow Us :
  • google news
  • dailyhunt

Mohsin Naqvi: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ముగిసినా సోషల్ మీడియాలో మాత్రం చర్చ మామూలుగా లేదు. ఎంతో బిల్డప్ కొట్టి.. మ్యాచ్‌కు ముందే హైడ్రామా క్రియేట్ చేసిన పాకిస్థాన్ భారత్ చేతిలో కుప్పకూలింది. ప్రస్తుతం పాకిస్థాన్ ప్లేయర్స్ పరిస్థితి దిక్కుతోచని స్థితిగా మారింది. ఎందుకంటే ఆ దేశంలో పాక్ జట్టును ఘోరంగా ట్రోల్ చేస్తున్నాయి. అయితే.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ స్టేడియం నుంచి మధ్యలోనే పరారయ్యాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. పాకిస్థాన్ వరుసగా వికెట్లు కోల్పోతున్న సమయంలోనే ఆయన బయటకు వెళ్లిపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. అసలు కారణం ఏమిటో అధికారికంగా చెప్పకపోయినా, ఆ టైమింగ్ మాత్రం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. పాకిస్థాన్ జట్టు హైడ్రామా క్రియేట్ చేసి ఘోరంగా పరాజయం పాలైనందుకు గానూ నఖ్వీపై అభిమానులు తిరగబడే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే అక్కడి నుంచి పరారైనట్లు కొందరు చెబుతున్నారు. భారత్ కంటే పాకిస్థాన్ క్రికెట్ అభిమానుల నుంచే ఎక్కువ థ్రెట్ ఉందట. అందుకే మధ్యలోనేలో జంప్ అయ్యాడని సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.

READ MORE: Mahesh Babu: బాబు కాల్ షీట్స్ కోసం నిర్మాతల క్యూ.. వారణాసి తర్వాత లక్కీ ఛాన్స్‌ ఎవరికంటే!

అయితే.. నిన్న జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్‌ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ బ్యాటింగ్ ప్రారంభం మాత్రం షాక్‌తోనే మొదలైంది. అభిషేక్ ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. ఆ సమయంలో ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడుతూ మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. అతని 77 పరుగుల ఇన్నింగ్స్ పూర్తిగా పాకిస్థాన్‌ బౌలర్లపై ఒత్తిడి తెచ్చింది. మరోవైపు తిలక్ వర్మ ప్రశాంతంగా 25 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. మధ్యలో వరుసగా వికెట్లు పడిపోవడంతో భారత్ 126/4 వద్ద కొంత కష్టంలో పడింది. హార్దిక్ పాండ్య పరుగులు చేయకుండానే అవుట్ కావడం పరిస్థితిని కఠినంగా మార్చింది. అయితే.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన అనుభవాన్ని ఉపయోగించి చివరి ఓవర్లలో ఇన్నింగ్స్‌ను అద్భుతంగా నడిపించాడు. శివం దూబే, రింకూ సింగ్ సైతం చక్కగా సహకరించారు. కఠిన పరిస్థితుల్లో పరుగుల వేగాన్ని పెంచుతూ భారత్‌ను 175/7 అనే పోటీ స్కోరుకు తీసుకెళ్లారు. పాకిస్థాన్‌ తరఫున సైమ్ అయూబ్ మూడు వికెట్లు తీసి మంచి బౌలింగ్ చేశాడు. 176 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్‌‌కు మొదటినుంచే దెబ్బలు తగిలాయి. హార్దిక్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి స్కోరు 34/4గా మార్చేశారు. ఒకవైపు వికెట్లు పడిపోతుంటే, మరోవైపు ఉస్మాన్ ఖాన్ మాత్రం ఒంటరిగా పోరాడాడు. 34 బంతుల్లో 44 పరుగులు చేసి కొంతసేపు మ్యాచ్‌లో ఉంచే ప్రయత్నం చేశాడు. కానీ అతనికి మద్దతు లేకపోవడంతో పాకిస్థాన్‌ ఇన్నింగ్స్ 18 ఓవర్లలో 114 పరుగులకే ముగిసింది. భారత్ బౌలర్లలో అక్షర్ పటేల్ అత్యుత్తమంగా నిలిచాడు. హార్దిక్ పాండ్య, బుమ్రా, వరుణ్ చక్రవర్తి కూడా కీలక వికెట్లు తీసి పాకిస్థాన్‌‌ను పూర్తిగా కట్టడి చేశారు.

READ MORE: India vs Pakistan: భారత్ చేతిలో పాక్ చిత్తు.. పాకిస్థాన్ అభిమానుల మీమ్స్ మామూలుగా లేవు..

VIDEO | ICC Men's T20 World Cup, 2026: PCB chief Mohsin Naqvi leaves R. Premadasa International Stadium. #INDvsPAK

(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/QXbYcjFUCN

— Press Trust of India (@PTI_News) February 15, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Colombo match updates
  • cricket viral news
  • IND vs PAK social media
  • India vs Pakistan T20 World Cup 2026
  • Mohsin Naqvi

తాజావార్తలు

  • Astrology: ఏప్రిల్‌ 18, శనివారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజలు చేయాలి..?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!

  • Women Reservation: అంకెల్లో గెలిచి.. అధిక్యంలో ఓడి.. బిల్లు వీగిపోవడం వెనుక ఉన్న కారణాలివే..

  • Reed Hastings: సొంత కంపెనీ నుంచి తప్పుకున్న ఫౌండర్.. నెట్‌ఫ్లిక్స్‌లో ముగిసిన ‘రీడ్ హేస్టింగ్స్’ శకం

ట్రెండింగ్‌

  • రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?

  • Burning Feet Hacks: పాదాల్లో మంటలా..? ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి.!

  • Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!

  • Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్‌నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!

  • Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్‌కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions