Lenovo ThinkPad L13 Gen 7: లెనోవో థింక్‌ప్యాడ్ L13 జెన్ 7 ల్యాప్‌టాప్ విడుదల.. 16GB ర్యామ్, 2TB స్టోరేజ్
- లెనోవో థింక్‌ప్యాడ్ L13 జెన్ 7 ల్యాప్‌టాప్ విడుదల
- ఈ ల్యాప్‌టాప్‌లో 13.3 అంగుళాల WUXGA IPS డిస్ప్లే
- 5MP వెబ్‌క్యామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ టెక్నాలజీ సంస్థ లెనోవో కొత్త బిజినెస్ ల్యాప్‌టాప్ ThinkPad L13 Gen 7ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇంటెల్ లూనార్ లేక్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్ తేలికైన డిజైన్, శక్తివంతమైన పనితీరు, ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. కంపెనీ ప్రకారం, కొత్త థింక్‌ప్యాడ్ L13 Gen 7 మునుపటి మోడళ్లతో పోలిస్తే మరింత తేలికగా, కాంపాక్ట్‌గా రూపొందించారు. ఇది ప్రొఫెషనల్స్, విద్యార్థులు, వ్యాపార వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.
ధర వివరాలు
ప్రస్తుతం లెనోవో థింక్‌ప్యాడ్ L13 Gen 7 ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ధర వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఈ ల్యాప్‌టాప్ కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. ఇది బ్లాక్ కలర్లో లభిస్తుంది.
Also Read
- Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
- Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
- iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
- iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
డిస్ప్లే, ప్రాసెసర్
ఈ ల్యాప్‌టాప్‌లో 13.3 అంగుళాల WUXGA IPS డిస్ప్లేను అందించారు. డిస్ప్లే 400 నిట్స్ బ్రైట్‌నెస్‌తో పాటు 100 శాతం sRGB కలర్ గామట్‌కు సపోర్ట్ చేస్తుంది. ThinkPad L13 Gen 7లో Intel Lunar Lake Processorను అమర్చారు. దీంతో మల్టీటాస్కింగ్, ప్రొడక్టివిటీ పనులు మరింత వేగంగా నిర్వహించవచ్చు. ర్యామ్, స్టోరేజ్.. గరిష్టంగా 16GB LPDDR5X RAM, 2TB PCIe SSD స్టోరేజ్ వరకు సపోర్ట్ ఈ స్పెసిఫికేషన్లు వేగవంతమైన పనితీరును అందిస్తాయి.
కెమెరా, కనెక్టివిటీ
ల్యాప్‌టాప్‌లో 5MP వెబ్‌క్యామ్ ను అందించారు. వీడియో కాల్స్, ఆన్లైన్ మీటింగ్స్‌కు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
కనెక్టివిటీ ఫీచర్లు:
Wi-Fi 7
Thunderbolt 4
USB-A పోర్ట్
3.5mm హెడ్‌ఫోన్ జాక్
ఆడియో ఫీచర్లు
ThinkPad L13 Gen 7లో
రెండు 2W స్టీరియో స్పీకర్లు
Dolby Atmos సపోర్ట్
డ్యూయల్ మైక్రోఫోన్ అందుబాటులో ఉన్నాయి. దీంతో మెరుగైన ఆడియో అనుభవం లభిస్తుంది.
బ్యాటరీ ఆప్షన్లు
లెనోవో ఈ ల్యాప్‌టాప్‌ను రెండు బ్యాటరీ వేరియంట్లలో అందిస్తోంది.
41Wh రీఛార్జబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ
54.7Wh రీఛార్జబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ
ఇవి 65W AC అడాప్టర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.
బరువు, కొలతలు
కొలతలు: 299 x 215 x 12~15.7 మి.మీ.
బరువు: 1.21 కిలోలు. తక్కువ బరువు కారణంగా ఈ ల్యాప్‌టాప్‌ను సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు