Chittoor: ‘ఆమె లేక నేను లేను’.. ప్రేమించిన అమ్మాయి సమాధి వద్దే ప్రియుడి ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chittoor: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు నగరంలో తీవ్ర విచారకరమైన ఘటన వెలుగుచూసింది. ప్రేమించిన అమ్మాయి దూరం కావడాన్ని తట్టుకోలేక, ఆమె అంత్యక్రియలు జరిగిన సమాధి వద్దే ప్రియుడు ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ప్రేమించిన జంట ఇద్దరూ ఆత్మహత్యలకు పాల్పడటంతో చిత్తూరు తోటపాళ్యం పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు తోటపాళ్యం ప్రాంతానికి చెందిన దుర్గ (18), లోకేష్ (20) గత కొంతకాలంగా గాఢంగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే ఏడాది క్రితం వీరిద్దరూ పెద్దలకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లి సమయంలో అమ్మాయి మైనర్ కావడంతో ఇరువైపుల కుటుంబ సభ్యులు, బంధువులు వారితో మాట్లాడి నచ్చజెప్పారు. చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఇద్దరినీ ప్రస్తుతానికి ఎవరి ఇంటికి వారిని పంపించి వేశారు.
ఇలా విడివిడిగా ఉంటున్న క్రమంలో ఈ నెల 16వ తేదీన దుర్గ.. తను ఇక లోకేష్‌తోనే ఉంటానని, తనను వెంటనే ఇంటికి తీసుకెళ్లాలంటూ గట్టిగా పట్టుబట్టింది. అయితే, చట్టపరమైన సమస్యలు లేదా కుటుంబ పరిస్థితుల కారణంగా లోకేష్ దీనిపై కాస్త నిమ్మళంగా వ్యవహరించాడు. ప్రియుడి ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన దుర్గ, మరుసటి రోజైన 17వ తేదీన తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియురాలు తన వల్లే ఆత్మహత్య చేసుకుందనే నిజాన్ని లోకేష్ అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర మానసిక వేదన, పశ్చాత్తాపంతో కుంగిపోయిన ప్రియుడు.. దుర్గ లేకుండా తాను బ్రతకలేనని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 20వ తేదీన దుర్గకు అంత్యక్రియలు నిర్వహించి, పూడ్చిపెట్టిన సమాధి వద్దకు చేరుకున్నాడు. ఆమె సమాధి పక్కనే ఉన్న ఒక చెట్టుకు ఉరివేసుకుని లోకేష్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ జంట ఆత్మహత్యలపై సమాచారం అందుకున్న చిత్తూరు టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ప్రస్తుతం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?