Samantha : టాలీవుడ్ లేడి సూపర్ స్టార్ అంటే సమంత మాత్రమే.. కారణం ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలి కాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయడం లేదు. అనుష్క నటించిన ఘాటీ, అనుపమ పరదా సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. ఇలాంటి తరుణంలో స్టార్ హీరోయిన్ సమంతా నటించిన సరికొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది.విడుదలకు ముందే సమంతా – నందిని రెడ్డి కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండగా ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 13.15 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.
సమంత నటించిన ఓ బేబీ, యశోద, శుభం సినిమాలు కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. మధ్యలో చేసిన శాకుంతలం అంతగా పర్ఫామ్ చేయకున్నా కూడా సామ్ తన స్టార్ డమ్ ని నిలబెట్టుకుంది. అందుకు ఉదాహరణ MIB కలెక్షన్స్ అనే చెప్పొచ్చు. సినిమా కంటెంట్ బాగుంటే హీరో, హీరోయిన్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయింది. తొలిరోజు కలెక్షన్లలో మహిళా ప్రేక్షకుల పాత్ర ఎక్కువగా ఉంది. ‘మా ఇంటి బంగారం’ సాధించిన ఈ ఓపెనింగ్స్ సమంతా కెరీర్లోనే కాకుండా ఇటీవల విడుదలైన ఇతర స్టార్ హీరోయిన్ల లేడీ ఓరియెంటెడ్ చిత్రాల రికార్డులను కూడా బ్రేక్ చేసింది. ‘ఘాటి’ చిత్రం తొలిరోజు రూ. 2 కోట్లు, రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ రూ. 1.30 కోట్ల మాత్రమే రాబట్టగా ఈ రెండు చిత్రాల కంటే 10 రెట్లు ఎక్కువ స్థాయిలో ‘మా ఇంటి బంగారం’ వసూళ్లను రాబట్టడం చూస్తుంటే టాలీవుడ్ లేడి సూపర్ స్టార్ అంటే సమంతా మాత్రమేనని ట్రేడ్ వర్గాలతో పాటు నెటిజన్స్ కితాబునిసున్నారు.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
- Tags
తాజావార్తలు
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!