టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అరుదైన రికార్డు సృష్టించాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కూడా వెనక్కి నెట్టేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో 37 రన్స్‌తో అదరగొట్టిన షమీ ఓ ఘనతనూ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మూడు సిక్సర్లు బాదిన షమీ తన సిక్స్‌ల సంఖ్యను 25కు పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ(24)ని దాటేశాడు. ఈ ఫార్మాట్‌లో 22 సిక్స్‌లు కొట్టిన రవిశాస్త్రి, ఉమేశ్ యాదవ్, యువరాజ్ సింగ్‌లను కూడా షమీ అధిగమించాడు.
Also Read: INDvsAUS 1st Test: కుప్పకూలిన ఆస్ట్రేలియా..తొలి టెస్టులో టీమిండియా ఘనవిజయం
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. మొదట ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 177 రన్స్‌కు ఆలౌటవగా.. భారత్ 400 రన్స్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 223 రన్స్ భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. రోహిత్ శర్మ (120) సెంచరీతో రెచ్చిపోగా అక్షర్ పటేల్ (84), రవీంద్ర జడేజా (70) సూపర్ బ్యాటింగ్ చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ కనీసం పోరాట చేయలేకపోయింది. అశ్విన్ (5), జడేజా (2) దెబ్బకు 91 రన్స్‌కే చాటచుట్టేసింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది.
Also Read: Turkey Earthquake: మృత్యుంజయుడు.. మూత్రం తాగి ప్రాణాలు కాపాడుకున్న యువకుడు