ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం (మే 30) కన్యాకుమారి లోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద దాదాపు రెండు రోజుల ధ్యాన వ్యాయామాన్ని మొదలు పెట్టనున్నారు. మోడీ కార్యక్రమం నేపథ్యంలో జిల్లాలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. 2019 ఎన్నికల ప్రచారం తర్వాత ఉత్తరాఖండ్ లోని కేదార్‌నాథ్ గుహలో ప్రధాని ఇలాంటి ధ్యానాన్ని చేపట్టారు. ధ్యాన్ మండపంలో మోడీ 45 గంటలపాటు బస చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన…