MLC Kavitha : బోధన్‌లో సీనియారిటీకి సిన్సియారిటీకి మధ్యే పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ జిల్లా బోధన్ ఎన్‌ఎస్‌ఎఫ్ మైదానంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి ఎమ్మెల్యే షకీల్‌తో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ నుంచి మంత్రిగా పని చేసిన సుదర్శన్ రెడ్డి ఒక్క చెరువు ను కూడ బాగు చేయలేదని, బోధన్ లో సీనియారిటీ కి సిన్సియారిటీకి మధ్యే పోటీ అంటూ వ్యాఖ్యానించారు ఎమ్మెల్సీ కవిత. లక్ష 30 వేల ఉద్యోగాలు ఇచ్చింది కేవలం తెలంగాణ లోనేనని, బీఆర్ఎస్ అంటే ఇంటి పార్టీ అన్నారు. మిగితా పార్టీలకు ఈవీఎం లాగా తెలంగాణ ప్రజలు కనపడుతారని, తెలంగాణ లో గులాబీ విప్లవం వచ్చిందన్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్ర చేసినట్లు రాహుల్ గాంధీ జోడో యాత్ర ఉందని, స్వాతంత్రం వచ్చాక ఏం చేశారు అని రాహుల్ యాత్ర చేసారన్నారు.
Also Read : Canara Bank : శుభవార్త చెప్పిన ప్రభుత్వ బ్యాంక్… ఇక మీ డబ్బు డబుల్ అవుతుంది
Also Read
- Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
రాహుల్ కుటుంబం అంత పాలించి ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. రాహుల్ ముత్తాత, నాన్నమ్మ, తండ్రి పాలనా చేసారు, దేశానికి ఏం చేశారు ? అని కవిత అన్నారు. రాష్ట్రం లో 10 ఏళ్ళు పాలించి కాంగ్రెస్ ఏం చేసిందని, తెలంగాణ పాలనను దేశం అంత అందిస్తామన్నారు కవిత. మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత సూచించారు. తెలంగాణలో ప్రతి కులానికి ఆత్మగౌరవ భవనం నిర్మించుకున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బోధన్‌లో 10వేల మంది బీడీ కార్మికులకు పెన్షన్ అందిస్తున్నామని, బోధన్‌లో 152 చెరువులను బాగు చేసుకున్నామని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్‌కు ఐటీ హబ్ తీసుకొచ్చామని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. ఇక్కడికి గూగుల్, ఇన్ఫోసిస్ కంపెనీలను కూడా తీసుకొస్తామని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణలో రూ.4వేల పెన్షన్ ఇస్తామని రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీని సైతం ఎమ్మెల్సీ కవిత ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.4వేల పెన్షన్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు ఎమ్మెల్సీ కవిత.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!