MLC Kavita : విచ్ఛిన్నకారుల పట్ల కవులు కలానికి పదునుపెట్టాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న వారి పట్ల కలాన్ని పదును పెట్టి సమాజాన్ని ఐక్యంగా ఉంచేలా కృషి చేయాలని కవులకు, రచయితలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఈ దేశంలో సమాజాన్ని విడదీసే వాతావరణాన్ని మనం చూస్తున్నామని, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఈ దేశంలో సహృద్భావ వాతావరణం సృష్టించడానికి సాహిత్య కారులు కృషి చేయాలని కోరారు. ఆదివారం రోజున న్యూఢిల్లీలో జరిగిన ఆజ్ తక్ (ఇండియా టుడే) సంస్థ వారి సాహిత్య సమ్మేళనం కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. సాహిత్య రంగానికి విశేషంగా కృషి చేసిన వారికి వచ్చే ఏడాది నుంచి భారత్ జాగృతి ఫౌండేషన్ – ఇండియూ టుడే సంస్థ సంయుక్తంగా సాహ్యిత పురస్కారాన్ని అందిస్తాయని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “సాహిత్యం జ్ఞానాన్ని ఇస్తుందటారు. సాహిత్యం జ్ఞానాన్ని ఇవ్వాలి అదే సమయంలో సమాజంలో మంచి వాతావరణం సృష్టించేలా సాహిత్యం ఉండాలి.
Also Read : Gongadi Trisha : టీమిండియా అండర్-19కు ఎంపికైన భద్రాచలం అమ్మాయి
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు రీత్యా దేశంలో మంచి వాతావరణం కల్పించే బాధ్యత కవులు, రచయితలపై ఉంటుంది. సాహిత్యకారులను ప్రోత్సహించడానికి, వారికి అండగా ఉండడానికి అవార్డును నెలకొల్పాము” అని వ్యాఖ్యానించారు. ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా కవులు, రచయితలు దేశం పట్ల మరింత బాధ్యతలో రచనలు చేస్తారని అభిప్రాయపడ్డారు. దేశంలో సమాజాన్ని విడగొట్టడానికి, మనస్సులను దూరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితి నెలకొందని, కాబట్టి కలానికి పదును పెట్టాలని కవులు, రచయితలకు పిలుపునిచ్చారు. విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తే కవులు సమాజాన్ని కలిపేందుకు కృషి చేయాలని అన్నారు. ఆ కృషికి భారత్ జాగృతి ఫౌండేషన్, ఇండియా టుడేతో పాటు తామంతా అండగా నిలబడుతామని, కలిసి నడుస్తామని స్పష్టం చేశారు.
సాహిత్యకారులను సన్మానించుకుంటే సమాజపు గౌరవం పెరుగుతుందని చెప్పారు. యువతకు సాహిత్యం అర్థంకాదని… భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లడంలో కలిసి రావడం లేదని కొంత మంది అంటారని, కానీ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొనడం గర్వంగా ఉందని స్పష్టం చేశారు. దేశ సాహిత్యం భారత యువత చేతుల్లో భద్రంగా ఉందని భావిస్తున్నానని కవిత తెలియజేశారు. సాహిత్య ప్రేమికురాలిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు.శబ్దమే శక్తి అని తాను బలంగా విశ్వసిస్తానన్నారు. ఒక శబ్దం లక్షాలది హృదయాలను కదిలిస్తుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నామని అన్నారు.
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!