Gongadi Trisha : టీమిండియా అండర్-19కు ఎంపికైన భద్రాచలం అమ్మాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వదేశంలో న్యూజిలాండ్ అండర్-19 మహిళల జట్టుతో జరగబోయే టీ20 సిరీస్‌కు భారత జట్టును ఆల్ ఇండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అయితే.. తెలంగాణలోని భద్రాధి కొత్తగూడెం జిల్లాకు చెందిన గొంగడి త్రిష టీమిండియా అండర్ 19 క్రికెట్ జట్టుకు ఎంపికైంది. భారత అండర్-19 అమ్మాయిల జట్టు న్యూజిలాండ్ తో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. అయితే.. 15 మంది సభ్యుల అండర్-19 జట్టులో త్రిషకు కూడా చోటు దక్కింది. త్రిష 8 ఏళ్ల వయసులోనే ఎంతో ప్రతిభ చూపి జిల్లాస్థాయి అండర్-16 జట్టుకు ఆడింది. ఆపై 12 ఏళ్ల వయసులో అండర్-19 జట్టుకు ఆడటం విశేషం. దీంతో పాటు.. 12 ఏళ్ల వయసులోనే హైదరాబాద్ మహిళల జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించింది త్రిష.
Also Read : Chiranjeevi: ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డు.. అంతా వారివలనే అన్న చిరు
చిన్న వయసులోనే బీసీసీఐ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది త్రిష.ప్రధానంగా లెగ్ స్పిన్నర్‌గానే కాకుండా.. బ్యాటింగ్ లోనూ తన ప్రతిభను కనబరుస్తూ ఆల్ రౌండర్‌గా దూసుకుపోతోంది. బౌలింగ్ లో అత్యధిక డాట్ బాల్స్ రికార్డు త్రిష పేరిట ఉన్నాయి. అయితే.. ఈ మొత్తం మ్యాచ్‌లన్నీ ముంబై వేదికగా జరగనున్నాయి. నవంబర్ 27న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక 15 మంది సభ్యుల భారత జట్టుకు శ్వేతా సెహ్రావత్ కెప్టెన్‌గా ఎంపికైంది.
Also Read : Megastar Chiranjeevi: చిరంజీవికి అరుదైన గౌరవం.. ప్రకటించిన కేంద్రం
Also Read
తాజావార్తలు
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!