24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేసినట్లు నిరూపిస్తే.. ఎన్నికల్లో పోటీ చేయనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాల్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. 2022 లో ఒక్క ట్రాన్స్ఫార్మర్ అయినా 24 గంటల విద్యుత్ సరఫరా చేశారా అని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రతి పథకానికి కాంగ్రెస్ పథకాలే ఆధారమని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధితోనే జగిత్యాలకు గుర్తింపు వచ్చిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read : Kurasala Kannababu: 90 శాతం కాపుల మద్దతు జగన్‌కే.. ఫ్యాన్స్ కోసమే పవన్ యాత్ర..!
అంతేకాకుండా.. ‘ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లో మేము..డబుల్ బెడ్రూం ఇల్లున్న గ్రామాల్లో ప్రచారం చేసుకుందాం.. రాబోయే ఎన్నికల్లో మంత్రి ఈశ్వర్ ను ప్రజలు ముక్కు భూమికి రాపిస్తారు.. ప్రభుత్వ వై ఫల్యాలను ఎత్తిచూపుతూ.. 22 న దశాబ్ద దగా పేరుతో ప్రదర్శన. ఉద్యమ ఆకాంక్ష లతో తెలంగాణ ఏర్పడింది.. మిగులు బడ్జెట్ రాష్ట్రం అప్పుల ఉబిలోకి నెట్టారు. రు.5లక్షల కోట్ల అప్పులు చేసి, పుట్ట బోయే ప్రతి బిడ్డ పై 1.25 లక్షల భారం మోపారు. ఏయే రంగంలో ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందో..ఆ రంగంలో ప్రభుత్వ వై ఫల్యాలను ప్రజలకు వాస్తవాలు వివరిస్తాం.. దళిత బంధు ప్రచారంగా మారింది. 2022-23 లో ఒక్కో నియోజక వర్గంలో 1500 మందికి 10 లక్షలు సాయల చేస్తామని చెప్పి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు.
Food Grain Prices : ద్రవ్యోల్బణం, రుతుపవనాల ఆలస్యం.. 15రోజుల్లో భారీగా పెరిగిన బియ్యం, పప్పు ధరలు
దళిత బంధు కేవలం ప్రచారానికే పరిమితం చేశారు. రాజ్యాంగ పరంగా దళితులకు దక్కాల్సిన హక్కులను తెలంగాణ ప్రభుత్వం కాలరాస్తోంది.. మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్ మా పరిధిలో లేదు అంటున్న కెసిఆర్ రిజర్వేషన్ కల్పిస్తామని ఎందుకు హామీ ఇచ్చారని నిలదీశారు.. మైనారిటీలకు నిధులు కేటాయించే అవకాశం మీ చేతుల్లోనే ఉండగా ఎందుకు కేటాయించలేదు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించింది విద్యార్థులు, నిరుద్యోగులు.. అందరికీ సమానంగా విద్య అందిస్తామని ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్భంద విద్య నినాదం ఏమైంది.. రాష్ట్రంలో 30 వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నయి..టెట్ నిర్వహించి ఏడాది గడుస్తుంది.. ఒక్క టీచర్ పోస్టు ఐనా భర్తీ చేశారా.. మన ఊరు మన బడి. ప్రాథమిక విద్య బోధనలో తెలంగాణ 25 స్థానానికి పడిపోయింది. ప్రాథమిక విద్య తో పాటు విశ్వవిద్యాలయ విద్య కూడా అమ్మకానికి పెట్టారని విమర్శించారు జీవన్ రెడ్డి.