Aishwarya Addala: వివాహేతర సంబంధాలు.. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. పెళ్లి చేసుకున్నాకా వేరేవారితో ఎఫైర్ పెట్టుకొని కట్టుకున్నవారిని మోసం చేస్తున్నారు. చివరికి కట్టుకున్నవారికి తెలిసేసరికి .. వారిని హత్య చేసి అడ్డు తొలగించుకుంటున్నారు. ఇలాంటి దారుణాలు నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితేఇలాంటి ఎఫైర్లకు సెలబ్రిటీలు కూడా అతీతులు కారు. ఎంతోమంది స్టార్ హీరోల భార్యలు.. తన భర్త.. మరొకరితో ఉంటున్నట్లు మీడియా ముందే బహిరంగంగా చెప్పిన సంఘటనలు కోకోల్లలు. అయితే మొదటిసారి నటి అయిన తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకొని.. డబ్బు కొట్టేసి.. తనకు విడాకులు కావాలని హింసిస్తుందని ఒక భర్త చెప్పడం గమనార్హం. ఆమె సీరియల్ నటి ఐశ్వర్య అడ్డాల. అమ్మాయి గారు, పలుకే బంగారామాయేనా, అలా వైకుంఠపురం, అత్తారింటికి దారేది సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య.. 2023 సెప్టెంబర్ 6న పిన్నింటి శ్యామ్ కుమార్ ను వివాహమాడింది.
పెళ్లి తరువాత కొన్నిరోజులు బాగానే ఉన్న శ్యామ్ కుమార్ కు.. ఉన్నాకొద్దీ ఐశ్వర్య లో మార్పులు కనిపించాయి. గంటల తరబడి కాల్స్ మాట్లాడడం, తన దగ్గర డబ్బులు తీసుకోవడం, అవి ఏం చేసిందో చెప్పకపోవడం జరుగుతూ వచ్చింది. అలా నెల తరువాత శ్యామ్ కుమార్ కు.. హైదరాబాద్‌కు చెందిన రియల్టర్ కరణం రమేష్ బాబుతో వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలిసింది. అప్పటినుంచి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలైనట్లు శ్యామ్ కుమార్ తెలిపాడు. తన దగ్గరనుంచి రూ. 25 లక్షలు తీసుకొని.. ఇప్పుడు విడాకులు ఇవ్వమంటుందని, తనకు విడాకులు ఇవ్వాలని లేదని చెప్పుకొచ్చాడు. ఇక ఐశ్వర్య, రమేష్ బాబు వీడియో కాల్స్ చేసుకున్న వీడియోలను కూడా శ్యామ్ బాబు బయటపెట్టాడు. ఆ వీడియోలో ఐశ్వర్య, రమేష్ బాబు మాట్లాడుకోవడం కనిపిస్తుంది.
ఇక ఈ వీడియోనే కాకుండా.. ఐశ్వర్య లాయర్, రమేష్ కు కాల్ చేసి మాట్లాడిన ఆడియో కాల్స్, ఐశ్వర్య లాయర్.. శ్యామ్ లాయర్ ను బెదిరించిన ఆడియో కాల్స్ కూడా బయటపడ్డాయి. ఆ అమ్మాయి తనకు అక్కా చెల్లి కాదని, ఆమె తనకు మంచి ఫ్రెండ్ అని, వాళ్ళ అమ్మానాన్న కూడా తనకు క్లోజ్ అని రమేష్ ఆ ఆడియోలో చెప్పుకొచ్చాడు. ఇక ఐశ్వర్య లాయర్.. ఆమెకు విడాకులు కావాలంటే.. గోల చేస్తున్నావెందుకు అని, కయ్యానికి కాలు దువ్వితే తాము కూడా అలాగే చేస్తామని బెదిరించింది. అంతే కాకుండా పెళ్లాం కావాలని ఏడుస్తున్నావ్ కాబట్టి.. సామరస్యంగా కూర్చొని మాట్లాడదామని బయటకు రమ్మన్నాము.. కానీ, నువ్వు ఇంటికి వచ్చి మాట్లాడు అంటున్నావ్.. తల్లిదండ్రులు రారు అంటున్నావ్.. ఇక మీ ఇష్టం.. కోర్ట్ లోనే తేల్చుకుందాం అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోలు, ఆడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.