Site icon NTV Telugu

MLA Vivek : అంతర్జాతీయంగా వస్తున్న ఆదరణను చూసి ఓర్చుకోలేక పోతున్నారు

Mla Vivek

Mla Vivek

కొన్ని పార్టీల వాళ్ళు బేస్ లెస్ ఎలిగేషన్స్ చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే వివేక్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌ను ఎందుకు బర్త్ రఫ్ చేయాలని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ కు అంతర్జాతీయంగా వస్తున్న ఆదరణను చూసి ఓర్చుకోలేక పోతున్నారని ఆయన ధ్వజమెత్తారు. బండి సంజయ్ ఇప్పటికే అనేక నిరాధార ఆరోపణలు చేసి న్యాయస్థానంలో కేసులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. మేము కూడా బండి సంజయ్ వ్యాఖ్యలపై న్యాయస్థానంను ఆశ్రయిస్తామని ఆయన వెల్లడించారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్టాల్లో పేపర్లు లీక్ చేసిన వారు బీజేపీ వాళ్లేనని, ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ ఉన్న వారు ఉద్యోగాలు పొందేలా చేస్తున్నారన్నారు.

Also Read : Rahul Gandhi: ప్రధాని మోదీతో మమతా బెనర్జీ ఒప్పందం.. రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నారు.

అఆ, ఇఈలు రాని వారు సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా ఉన్నారని, పేపర్ లీక్ విషయంలో బండి సంజయ్ కుట్రలు చేసారనడంలో సందేహం లేదన్నారు. దేశంలో అనేక నోటిఫికేషన్లు తప్పుడు విధానాలతో ఉద్యోగాల భర్తీ చేస్తున్నారని, ముందు బీజేపీ పాలిత రాష్టాల్లో పేపర్ లీక్ లకు పాల్పడ్డ మంత్రులు, ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలన్నారు. ప్రజా కోర్టులో వీరికి శిక్ష తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో యువకుడి ఆత్మహత్యపై మాజీ ఎంపీ వివేక్ చేసిన ఆరోపణలపై ఆయన క్షమాపణలు చెప్పాలన్నారు.

Also Read : Tollywood movies: ఈ వారం ఉగాదికి… ఆ తర్వాత….

Exit mobile version