Tollywood movies: ఈ వారం ఉగాదికి… ఆ తర్వాత….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu Cinema: మార్చిలో ఐదు ఫ్రైడేస్ రావడంతో దాదాపు 30 చిత్రాలు విడుదల అయ్యేలా ఉన్నాయి. ఇప్పటికే అనువాద చిత్రాలతో కలిపి సుమారు 20 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ వారం 22న తెలుగు సంవత్సరాది కావడంతో సినిమాల సందడి మరి కాస్తంత పెరిగింది. ఉగాది బుధవారం రావడంతో… ఈ వారమంతా తమకు కలిసి వస్తుందని కొందరు దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. దాంతో ఫ్రైడే కాకుండా రెండు రోజుల ముందే తమ చిత్రాలను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు.
అలా ఈ ఉగాది వస్తున్న చిత్రాలలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘దాస్ కా ధమ్కీ’. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు ప్లాన్ చేశారు. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించిన ‘దాస్ కా ధమ్కీ’ పాటలు ఇప్పటికే విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ చూసిన వారు మాస్ ను విశేషంగా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఇక ఉగాది రోజునే కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ మూవీ వస్తోంది. ఇది మరాఠీ చిత్రం ‘నటస్రమాట్’కు రీమేకే అయినా… కృష్ణవంశీ దీనికి తనదైన శైలిలో తెలుగుదనాన్ని అద్దారు. ఈ సినిమా ప్రీమియర్స్ కు విశేష స్పందన లభించింది. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం పోటీ పడి నటించారని, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు అద్భుత నటన కనబరిచారని అంటున్నారు. సీతారామశాస్త్రి, లక్ష్మీ భూపాల్, కాసర్ల శ్యామ్, విజయ్ కుమార్ రాసిన పాటలకు ఇళయరాజా స్వరరచన చేశారు. ఈ మూవీతో కృష్ణవంశీ మరోసారి తానేమిటో నిరూపించుకున్నాడని చెబుతున్నారు. ఇక ఉగాది రోజునే నిజ ఘటనల ఆధారంగా రూపొందిన ‘గీత సాక్షిగా’ మూవీ రాబోతోంది. ఆదర్శ్, చిత్రా శుక్లా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. నిర్మాత చేతన్ రాజే కథను అందించారు. ఆంధోని మట్టిపల్లి ఈ మూవీని తెరకెక్కించారు. అదే రోజున శివ పాలమూరు దర్శకత్వంలో మహి రాథోడ్ నిర్మించిన ‘1992’ మూవీ, కాజల్ నటించిన తమిళ అనువాద చిత్రం ‘కోస్టీ’ వస్తున్నాయి.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
ఇక రెగ్యులర్ ఫ్రైడే రిలీజెస్ ఉండనే ఉన్నాయి. భాస్కర రాజు, ధార్మికన్ రాజు నిర్మాతలుగా రాజ్ కార్తికేన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం ‘రాజ్ కహాని’. ఈ నెల 24న రాబోతున్న ఈ సినిమాకు చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ సంగీతం అందించాడు. విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభశ్రీ ప్రధాన పాత్రలు పోషించిన ‘కథ వెనుక కథ’ చిత్రం శుక్రవారం వస్తోంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో అవనింద్ర కుమార్ దీన్ని నిర్మించారు. అలానే ఆంగ్ల చిత్రం ‘జాన్ విక్ -4’ సైతం తెలుగులో డబ్ అయ్యి 24న వస్తోంది. ఆ రకంగా ఈ వారం 8 సినిమాను థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!