MLA Rekha Nayak : ఇప్పుడు అయితే నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 95-105 సీట్లు గెలుస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
Also Read : Bandi Sanjay : గజ్వేల్‌లో ఓడిపోతననే కేసీఆర్ కామారెడ్డికి పోతుండు
Also Read
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Assam: పట్టాలపైకి భారీ ఏనుగుల గుంపు.. నిలిచిపోయిన రైళ్లు
- Southern Zonal Council Meeting: సీట్లు తగ్గొద్దు.. నిధులు తగ్గొద్దు.. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి డిమాండ్
- Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
అయితే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాల్లో బీఆర్ఎస్ 95-105 స్థానాల్లో విజయం సాధిస్తుందని కేసీఆర్ విలేకరుల సమావేశంలో అన్నారు. అంతేకాకుండా.. ఎంఐఎం, హైదరాబాద్ లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో బీఆర్ఎస్ స్నేహం కొనసాగుతుందని కేసీఆర్ ప్రకటన చేస్తూనే చెప్పారు. అయితే.. బోథ్, ఖానాపూర్, వైరా, కోరుట్ల, ఉప్పల్, ఆసిఫాబాద్, మెట్పల్లి ఏడు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చింది. కాగా, గోషామహల్, నాంపల్లి, జనగాం, నర్సాపూర్ నాలుగు నియోజకవర్గాలకు అధికార పార్టీ అభ్యర్థులను ఖరారు చేయలేదు.
Also Read : Pakisthan: పాకిస్థాన్ లో కొద్దీ ఇళ్లకు, చర్చిలకు నిప్పు..
అయితే.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రస్తుత ఎమ్మెల్యే రేఖా నాయక్ స్థానంలో జాన్సన్‌కు అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ అధిష్టానం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేఖా నాయక్ స్పందిస్తూ.. ఇంకా 50 రోజుల వరకూ నేను ఎమ్మెల్యేగా ఉంటానన్నారు. మిగిలిన పనులు చేస్తానని, ఇప్పుడు అయితే నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని ఆమె వ్యాఖ్యానించారు. నేను ఇంకా వేరే ఆలోచించ లేదని, లాస్ట్ ఊపిరి వరకు ఖానాపూర్ లో ఉంటానని ఆమె వెల్లడించారు. ఖానాపూర్ ప్రజలే నా అమ్మానాన్న అని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారే ఆలోచన చేయలేదని, నా జీవితం ప్రజలకు అంకితమన్న రేఖానాయక్.. చావైనా బతుకైనా ఇక్కడే అని వ్యాఖ్యానించారు.
అయితే.. రేఖా నాయక్ 2009లో రాజకీయాల్లోకి ప్రవేశించి భారత జాతీయ కాంగ్రెస్ తరపున ఆసిఫాబాద్ జెడ్పీటీసీ మెంబర్ గా పోటీచేసి విజయం సాధించింది. 2013లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించింది. 2014లో ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రితేష్ రాథోడ్ పై 30వేల మెజారిటీతో విజయం సాధించింది. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమేష్ రాథోడ్ పై 24,300 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.
తాజావార్తలు
-
Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
-
Telangana High Court : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై హైకోర్టు ఫైర్.. స్టే ఎత్తివేతకు నిరాకరణ.!
-
Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
-
Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
-
CP VC Sajjanar : బైక్‌పై సీపీ సజ్జనార్.. కేబీఆర్ వన్‌వేపై సడన్ చెక్.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!