తెలంగాణ రాష్ట్రంలో పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటుకు, నీళ్లకు మళ్ళీ కష్టాలు తప్పవని జడ్చర్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే చీకటి రోజులే వస్తాయని ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల మండలం కోడుగల్ గ్రామంలో పర్యటించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి అడుగడుగునా మహిళలు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. హారతులు పట్టి మళ్ళీ మీరే రావాలంటూ దీవించారు.
Read Also: Yogi Adityanath: అయోధ్యలో దీపోత్సవ్.. ఆ రికార్డ్ మీద కన్నేసిన యోగి సర్కార్
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గతంలో 11 సార్లు అధికారం ఇస్తే కనీసం తాగునీళ్లు కూడా ఇవ్వనోళ్లు ఇవాళ వచ్చి ఉచిత పథకాల పేరుతో హామీ ఇస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి రాగానే చేతులు ఎత్తేసారని ఆయన చెప్పారు. నిర్ణయాలు తీసుకునే అధికారం మన చేతిలో ఉండాలంటే బీఆర్ఎస్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని జడ్చర్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కోరారు.