తెలంగాణ రాష్ట్రంలో పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటుకు, నీళ్లకు మళ్ళీ కష్టాలు తప్పవని జడ్చర్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విమర్శలు గుప్పించారు.
భూఆక్రమణలు,వసూళ్ళకు పాల్పడితే, టిఆర్ఎస్ కౌన్సిలర్లు,నాయకులను పార్టీనుండి సస్పెండ్ చేస్తామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హెచ్చరించారు. మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనపై వాఖ్యలు చేశారు. మున్సిపాలిటీకి చెందిన పది శా తం, మరికొన్ని స్థలాలు, గాంధీ ట్రస్టు భూమి, దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని.. అధికార పార్టీ నాయకులే కబ్జాలు చేశారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీ ట్రస్టు సుమారు 60 ఏండ్ల కిందట ఏర్పాటైందని,…