ప్రపంచ సుందరి కిరీటాన్ని థాయ్‌లాండ్ భామ ఒపాల్ సుచతా చువాంగ్‌శ్రీ సొంతం చేసుకుంది. మిస్ వరల్డ్ 72 విజేతగా ఒపాల్ సుచతా చువాంగ్‌శ్రీ నిలిచింది. ఒపాల్ సుచతా చువాంగ్‌శ్రీకి మిస్ వరల్డ్ కిరీటాన్ని సీఎం రేవంత్ రెడ్డి, జూలియా మోర్లీ, క్రిస్టినా పిజ్కోవా అలంకరించారు.
హైటెక్స్‌లో మిస్ వరల్డ్ ఫైనల్స్ కొనసాగుతున్నాయి. తాజాగా మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా నిష్క్రమించారు. ఖండాల వారీగా టాప్ 5 నుంచి ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేస్తున్నారు నిర్వాహకులు.. ఆసియా నుంచి టాప్ 2లోకి థాయ్‌లాండ్ అభ్యర్థి చేరారు. నువ్వు మస్‌వరల్డ్ అయితే ఏం చేస్తావని అడిగిన ప్రశ్నకు 45 సెకన్లలో మెరుగైన సమాధానం ఇచ్చిన వారికి అవకాశం కల్పించారు.. అభ్యర్థుల సమాధానాలకు జడ్జీల మార్కులు వేసి నిర్ణయిస్తారు.
ప్రపంచ సుందరి-2025 పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. మరికాసేపట్లో మిస్ వరల్డ్ విజేతను ప్రకటించనున్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో మిస్ వరల్డ్ ఫైనల్స్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
భాగ్యనగరంలో మిస్ వరల్డ్ పీజెంట్ ఘనంగా జరిగింది. నెల రోజుల పాటు అందాల సంబరం అంబరాన్నంటింది. హైదరాబాద్ బ్రాండ్ పెంచేలా.. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసేలా కార్యక్రమాల రూపకల్పన జరిగింది. చేనేత దగ్గర్నుంచీ వైద్యసేవల వరకూ అన్ని రంగాలనూ అందగత్తెలకు పరిచయం చేశారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదం అడుగడుగునా ప్రతిఫలించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
Sabitha Indra Reddy : హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల నేపథ్యంలో సంచలన ఆరోపణలు వెలువడటంతో రాష్ట్ర రాజకీయ వర్గాలు గాఢ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ విషయంలో తమ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సబితా ఇంద్రారెడ్డి ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలలో, తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్రం , భారతదేశ ప్రతిష్టను దిగజార్చిందని మండిపడ్డారు. హైదరాబాదులో నిర్వహిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్…
KTR : హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు తాజాగా వివాదంలో చిక్కుకున్నాయి. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలు ఈ పోటీల చుట్టూ కలకలం రేపుతున్నాయి. ఈ పోటీల్లో పాల్గొన్న మిల్లా, నిర్వాహకులు తమపై అసభ్యమైన ఒత్తిడులు తీసుకువచ్చారని, స్పాన్సర్లను ఆకట్టుకోవాలనే ముట్టడి ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. ఇది వేశ్యలాగానే ప్రవర్తించినట్లుగా అనిపించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమె పోటీని మధ్యలోనే వదిలేసి స్వదేశానికి తిరిగిపోయినట్లు సమాచారం. ఈ పరిణామాలపై…
Miss World 2025: మిస్ వరల్డ్ వేదికపై మరోసారి తెలంగాణ సంసృతీ, సంప్రదాయాలు తళుక్కున మెరిసాయి. ఇవాళ జరిగిన వరల్డ్ ఫ్యాషన్ ఫినాలే షోలో పోటీదారులు అందరూ తెలంగాణకు ప్రత్యేకమైన పోచంపల్లి, గద్వాల్ చీరలు ధరించి ర్యాంపుపై వాక్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అంతర్జాతీయ ఖ్యాతి పొందిన పోచంపల్లి హ్యాండ్లూమ్ వస్త్రాలతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మెరిశారు. వందకు పైగా దేశాల ప్రతినిధులు చీరకట్టులో సంప్రదాయబద్దంగా కనిపించారు. అమెరికా కరె్బియన్ దేశాలకు చెందిన సుందరీమణులు…
Miss World 2025: 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన “హెడ్-టు-హెడ్ చాలెంజ్” ఫినాలే సందర్భంగా.. వివిధ ఖండాల నుంచి వచ్చిన అందాల కిరీటధారులు తెలంగాణ రాష్ట్రాన్ని, ముఖ్యంగా హైదరాబాద్‌ను అభినందనలతో ముంచెత్తారు. ఈ పోటీ సందర్భంగా జడ్జీలు అడిగిన ప్రశ్నలకు తెలంగాణ సంస్కృతి, అభివృద్ధి, మహిళల సాధికారత, భద్రతకు సంబంధించి కంటెస్టెంట్స్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. తెలంగాణ రాష్ట్రం మహిళల భద్రతను హక్కుగా గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటుందన్న విషయాన్ని…