మెగా కోడలు వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠీ పెళ్లి తర్వాత వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇక పెళ్లి తరువాత కూడా ఇండస్ట్రీలో కొనసాగుతాను అని తెలియజేసిన లావణ్య.. ఇప్పుడు బ్యాక్ టు వర్క్ వచ్చేశారు. ఓ తమిళ్ సినిమాలో నటిస్తున్న లావణ్య.. ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు. ఇటీవల ఈ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేశారు…ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠీ, అభిజీత్ దుద్దాల, అభిజ్ఞ ఉతలూరు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “మిస్ పర్ఫెక్ట్” వెబ్ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహిస్తున్నారు.
తాను చేసే ప్రతి పనిలో, తన చుట్టూ ఉన్న ప్రతి విషయంలో పర్ఫెక్షన్ కోరుకునే యువతి పాత్రలో లావణ్య కనిపించింది. ఆమె పొరుగింట్లో ఉండే కుర్రాడు అభిజీత్ కూడా ఇలాగే ప్రతి పని పర్ఫెక్ట్ గా చేయాలనుకుంటాడు. వీళ్లిద్దరి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ చుట్టూ అల్లుకున్న హిలేరియస్ ఎంటర్ టైనింగ్ కథే “మిస్ పర్ఫెక్ట్” వెబ్ సిరీస్ అని టీజర్ తో తెలుస్తోంది. త్వరలో డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోందని వార్తలు వినిపించాయి..
మిస్ పర్‌ఫెక్ట్ సిరీస్ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. జనవరి 22న ఈ సిరీస్ ట్రైలర్ కూడా విడుదలై యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. తాజాగా, స్ట్రీమింగ్ డేట్‌ను కూడా లాక్ చేసుకున్నట్లు సమాచారం. మిస్ ఫర్‌ఫెక్ట్ డిస్నీ+ హాట్‌స్టార్లో
ఫిబ్రవరి 2 నుంచిస్ట్రీమింగ్ కాబోతుంది.. ఇది ఒక లవ్ స్టోరీనా? లేక గందరగోళం, క్రేజీనెస్, క్యూట్‌నెస్ ఉండే ఈ రోమ్ కామ్ మీ హృదయాన్ని తాకుతుంది.