Kerala High Court: తోబుట్టువును గర్భవతిని చేసిన సోదరుడు.. గర్భం తొలగింపునకు కోర్టు అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala High Court: సమాజంలో మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. మహిళలపై దాడులు పెరిగాయి. జంతువుల కంటే హీనంగా వావివరుసలు మర్చిపోతున్నారు. తండ్రి కూతుళ్లపై, అన్నలు సోదరిలపై, మామలు కోడళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతూ.. కామాగ్నితో కొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. తోడ బుట్టిన సోదరుడే 15 ఏళ్ల బాలికను గర్భవతిని చేశాడు. ఇప్పుడు 7 నెలల గర్భాన్ని తొలగించుకునేందుకు కేరళ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మెడికల్ బోర్డు సమర్పించిన రిపోర్టును పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ జియాద్ రెహమాన్ ఎఎ, గర్భం తొలగింపునకు అనుమతించకపోతే వివిధ సామాజిక, వైద్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించింది.
Read Also:Karnataka Teacher : కర్ణాటక సీఎంను విమర్శించిన టీచర్ సస్పెండ్
Also Read
వివరాల్లోకి వెళితే.. కేరళలో ఒకే తల్లికడుపున పుట్టిన సోదరుడి వల్ల ఓ మైనర్ బాలిక గర్భవతి అయింది. ప్రస్తుతం సదరు బాలిక 7 నెలల గర్భిణి. తన గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతి ఇవ్వాలన్న బాలిక విజ్ఞప్తి, కుటుంబ సభ్యుల వినతికి కేరళ హైకోర్టు సమ్మతించింది. మెడికల్ రిపోర్టులు ఆమోదయోగ్యంగా ఉంటే గర్భవిచ్చిత్తి చేసుకోవచ్చని తీర్పును ఇచ్చింది. మైనర్ బాలిక గర్భం తొలగించాలని ఆమె తండ్రి కోరడంతో అబార్షన్ కు అనుమతి ఇవ్వకపోతే వివిధ సామాజిక, వైద్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కోర్టు తెలిపింది. బాలికను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు సమర్పించిన నివేదిక ఆధారంగా జస్టిస్ జియాద్ రెహ్మాన్ తో కూడిన సింగిల్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. 32 వారాలకు పైగా గర్భం కొనసాగడం వల్ల బాధితురాలి సామాజిక, మానసిక ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగే అవకాశం ఉందని తెలిపింది.
Read Also:Vijayawada: హెడ్ కానిస్టేబుల్ సైడ్ బిజినెస్.. ఇంట్లోనే మసాజ్ సెంటర్
సొంత తోబుట్టువు నుంచి పుట్టిన బిడ్డను పరిగణనలోకి తీసుకుంటే పలు సామాజిక, వైద్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గర్భాన్ని తొలగించడానికి పిటిషనర్ కోరిన అనుమతి అనివార్యంగా గుర్తించింది. మెడికల్ రిపోర్టును పరిశీలించిన తర్వాత ఆ శిశువు శారీరకంగా ఫిట్ గా ఉన్నట్లు స్పష్టమవుతోందనీ, గర్భం కొనసాగడం వల్ల శిశువు సామాజిక, మానసిక ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని తీర్పులో పేర్కొంది. ఆ బాలిక సజీవ శిశువుకు జన్మనిచ్చే అవకాశం ఉందని మెడికల్ బోర్డు తెలిపింది. కానీ దీనికి గల పరిస్థితుల్లో పిటిషనర్ కుమార్తె గర్భాన్ని మెడికల్ టర్మినేషన్ కు అనుమతించేందుకు తాము మొగ్గు చూపుతున్నట్లు న్యాయస్థానం తెలిపింది. అందువల్ల పిటిషనర్ కుమార్తె గర్భాన్ని ఆలస్యం చేయకుండా వైద్యపరంగా తొలగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నామని న్యాయమూర్తి మే 19న ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!