Dulkar Salman : మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు కేరళ హైకోర్టులో భారీ ఊరట లభించింది. భూటాన్ నుంచి అక్రమంగా కార్లను దిగుమతి చేసుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో.. రీసెంట్ గా ఐటీ అధికారులు కేరళలోని సెలబ్రిటీల ఇళ్లపై దాడులు నిర్వహించారు. పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్ సహా చాలా మందికి చెందిన 20 లగ్జరీ కార్లను సీజ్ చేశారు. దీంతో దుల్కర్ సల్మాన్ హైకోర్టుకు వెళ్లారు. ఆయన పిటిషన్ ను విచారించిన కోర్టు.. కారు…
High Court: బిచ్చగాడు అయిన భర్తను, భార్య భరణం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బిక్షాటన చేస్తూ బతికే తన అంధుడైన భర్త నుంచి భరణం కోరుతూ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు తీర్పు చెప్పింది. ‘‘ఒక బిచ్చగాడిని తన భార్యకు భరణం చెల్లించమని బలవంతం చేయకూడదు’’ అని వ్యాఖ్యానించింది. అదే సమయంలో, నిరుపేద జీవిత భాగస్వాములకు ఆహారం, దుస్తులు అందేలా చూసుకోవడానికి రాష్ట్రం జోక్యం చేసుకోవాలని ఆదేశించింది.
నటి లక్ష్మీ మీనన్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. సెప్టెంబర్ 17వరకు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూర్ చేసింది కేరళ కోర్ట్. అప్పటి వరకు లక్ష్మీ మీనన్‌కు అరెస్ట్ చేయవద్దని పోలీసులకు తెలిపింది. ఓ ఐటీ ఉద్యోగినిని కిడ్నాప్ చేసి, అనంతరం దాడి చేసిన కేసులో ఆమెపై కేసు నమోదు చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు. నిందితుల్లో్ ముగ్గురిని అరెస్ట్ చేశామని, మరో నిందితురాలైన నటి లక్ష్మీ మీనన్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఎఫ్ఐఆర్‌లో…
ఈ మధ్య నటీనటులుగా గుర్తింపు తెచ్చుకున్న అనంతరం పలువురు తారలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సామాన్యులతో దురుసు ప్రవర్తన, సోషల్ మీడియాలో పోస్టులతో నిత్యం వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన కిడ్నాప్ కేసులో చిక్కుకుంది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ హీరోయిన్ పరారీలో ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే.. మలయాళీ సినిమాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లక్ష్మీ మీనన్. 2011లో విడుదలైన రఘువింతే స్వాంతం రసియా అనే సినిమాతో…
Kerala High Court: కేంద్రమంత్రి, మలయాళ స్టార్ హీరో సురేష్ గోపి, నటి అనుపమ పరమేశ్వరన్ నటించిన మళయాల సినిమా ‘‘JSK - జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ’’లో ‘‘జానకి’’ పేరు ఉపయోగించడంతో వివాదం ప్రారంభమైంది. ఈ పేరు ఉపయోగించడం ద్వారా మతపరమైన సెంటిమెంట్లు దెబ్బతింటాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని కేరళ హైకోర్టు శుక్రవారం ప్రశ్నించింది.
కేరళ హైకోర్టు పబ్లిక్ వాష్‌రూమ్‌లకు సంబంధించి కీలక తీర్పు వెలువరించింది. పెట్రోల్ పంపుల వద్ద ఉన్న టాయిలెట్‌లు సాధారణ ప్రజల ఉపయోగం కోసం కాదని తెలిపింది. పెట్రోల్ పంపుల వద్ద ఉన్న టాయిలెట్లను బహిరంగంగా బహిర్గతం చేయకూడదని డిమాండ్ చేస్తూ పెట్రోల్ పంపుల యజమానుల తరపున కోర్టులో పిటిషన్ దాఖలైంది. పెట్రోల్ పంపుల వద్ద ఉన్న టాయిలెట్లను ప్రజా సౌకర్యంగా వర్గీకరించడంపై రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలపై పంపుల యజమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. Also Read:ENG…
High Court: వివాహ సమయంలో వధువుకు బహుమతిగా వచ్చే బంగారు ఆభణాలు, నగదు ఆమెకు సంబంధించిన ఆస్తి అని లేదా దానిని ‘స్త్రీ ధనం’’గా పరిగణించాలని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అటువంటి ఆస్తిపై మహిళకు ప్రత్యేక హక్కులు ఉంటాయని చెప్పింది. ఎర్నాకుట కలమస్సేరికి చెందిన ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ని న్యాయమూర్తులు దేవన్ రామచంద్రన్, ఎంబి స్నేహలతతో కూడిన డివిజన్ బెంచ్ విచారించి , ఈ తీర్పుని చెప్పింది. విడాకుల తర్వాత పెళ్లి సమయంలో…
Ragging Cases: కేరళ రాష్ట్రంలో ర్యాగింగ్ కేసులు పెరుగుదలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ర్యాగింగ్ సంఘటనలపై కఠినమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ కేరళ లీగల్ సర్వీసెస్ అథారిటీ (కేఎల్ఎస్ఎ) దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.
Kerala High Court: మహిళపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిల శరీరాకృతి గురించి తప్పుడు కామెంట్స్ చేయడం వారి గౌరవానికి భంగం కలిగించడమే అన్నారు.
Kerala High Court: ఆసుపత్రులు "ఆధునిక సమాజంలోని దేవాలయాలు" అని, కఠినమైన చట్టపరమైన చర్యల ద్వారా విధ్వంసం నుండి రక్షించబడాలని కేరళ హైకోర్టు నొక్కి చెప్పింది. డిసెంబర్ 07న కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఆయుర్వేద ఆస్పత్రి ధ్వంసం చేసి, రూ. 10,000 నష్టానికి కారణమైన కేసులో నిందితుడైన వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు.