బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం అని ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు మాత్రం మారడం లేదు. ఇంట్లో ఉన్న తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మలు తమ మనుమరాలు, మనువడి పెళ్లి చూసి చనిపోవాలి అని తమ కోరికలను వెలిబుచ్చుతుంటారు. వాళ్ల కోరికలను కాదనలేక పిల్లలకు పెళ్లి చేసేందుకు రెడీ అవుతుంటారు. ఇదే తరహాలో హర్యానాలో ఓ నానమ్మ మునిమనవడిని చూడాలనే కోరకతో తన మనుమరాలికి పెళ్లి చేయాలని చూసింది. కానీ ఆ అమ్మాయి మైనర్ కావడంతో పెళ్లికి బ్రేకులు పడ్డాయి.…