కంచ గచ్చిబౌలి భూములపై సీఎం రేవంత్రెడ్డికి మంత్రుల కీలక ప్రతిపాదన సమర్పించారు.. ఈ వ్యవహారంపై భేటీ అయిన మంత్రులు.. కంచ గచ్చిబౌలి భూముల్లో అతి పెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. బర్డ్పార్క్, బట్టర్ఫ్లై గార్డెన్, తాబేళ్ల పార్క్, ఫ్లవర్ గార్డెన్ ఏర్పాటు, లేక్స్ అండ్ రాక్స్కు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.. ప్రభుత్వ భూమి 400 ఎకరాలతో పాటు మరో 1600 ఎకరాలు సేకరించాలని సూచించారు.. రాజీవ్ పార్క్గా పేరు పెట్టాలని ప్రతిపాదనలో తెలిపారు.. 2000 ఎకరాల్లో ప్రపంచస్థాయి ఎకో పార్క్ ఏర్పాటు చేయాని.. ప్రభుత్వ భూమి 400 ఎకరాల్లోనే కాకుండా హెచ్సీయూ 1600 ఎకరాలు కలిపి ఏర్పాటు చేయాలన్నారు… ఈ నిర్మాణం హైదరాబాద్కే తలమానికంగా మారుతుందన్నారు.
READ MORE: Hepatitis Test: కోనసీమ జిల్లాలో హైపటైటిస్ పరీక్షలు.. 205 మందికి పాజిటివ్
మరోవైపు.. హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై కాంగ్రెస్ నేతల కీలక భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో నేడు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు హెచ్‌సీయూ భూముల విషయంలో ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశం కానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్‌లో ఎన్‌ఎస్‌యూఐ నాయకులతో సమావేశం కానున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో మరి కొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.
READ MORE: HCU: హెచ్‌సీయూ భూముల వివాదంపై కాంగ్రెస్ నేతల కీలక భేటీ!