AP Cabinet Reshuffle: కేబినెట్‌లో మార్పులు.. ఇలా స్పందించిన రోజా, అంబటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Reshuffle: మంత్రులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమావేశం అవున్న సమయంలో.. కేబినెట్‌లో మార్పులు, చేర్పులపై జోరుగా చర్చ సాగుతోంది.. గడపగడపకు మన ప్రభుత్వం, ఇతర కార్యక్రమాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నా.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతోన్న ఈ సమయంలో.. కీలక నిర్ణయాలు ఉంటాయనే ప్రచారం సాగుతోంది.. ఇక, ఆ ప్రచారంపై స్పందించిన మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Also: Pawan Kalyan Delhi Tour: ఢిల్లీలో జనసేనాని.. ఇద్దరు కీలక నేతలతో భేటీ..!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
మంత్రివర్గంలో మార్పులు అన్నది మీడియా ప్రచారం మాత్రమేనంటూ కొట్టిపారేశారు మంత్రి అంబటి రాంబాబు.. మీడియాకి కూడా రేటింగ్ కావాలి కాబట్టి ప్రచారాలు చేస్తాయన్న ఆయన.. సీఎం వైఎస్ జగన్ స్ట్రెయిట్ రాజకీయాలు చేసే వ్యక్తి.. ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం లేదంటే టికెట్ ఇవ్వలేను అని ముందే చెప్పేస్తారన్నారు.. చివరి వరకు ఆశల్లో పెట్టి మోసం చేసే తత్వం జగన్‌ను కాదన్న ఆయన.. ఈ నెల 7వ తేదీ నుంచి జగనన్నే మా నమ్మకం కార్యక్రమం ప్రారంభం అవుతుంది.. దానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో వివరిస్తారని తెలిపారు.
ఇక, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి సక్రమంగా అందుతున్నాయా..? లేదా..? చూసేందుకు గడప గడపకు మన ప్రభుత్వం చేస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడం, అసెంబ్లీ జరగడంతో బ్రేక్ వచ్చిందన్నారు మంత్రి ఆర్కే రోజా.. భవిష్యత్ కార్యాచరణ కోసం ఈ రోజు సీఎం జగన్ సమావేశం ఏర్పాటు చేశారు. నాకు తెలిసినంతవరకూ మంత్రివర్గంలో మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు. మంత్రులందరూ బాగానే పని చేస్తున్నారని తెలిపారు.. మమ్మల్ని మేం నిరూపించుకోవడానికి మంత్రి పదవులు వచ్చి ఏడాదే అయ్యిందన్నారు మంత్రి ఆర్కే రోజా. కాగా, తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం వేదికగా ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, రీజినల్ కోఆర్డినేటర్లు, సీనియర్ నేతలతో సమావేశం అయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..