AP Cabinet Reshuffle: మంత్రులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమావేశం అవున్న సమయంలో.. కేబినెట్‌లో మార్పులు, చేర్పులపై జోరుగా చర్చ సాగుతోంది.. గడపగడపకు మన ప్రభుత్వం, ఇతర కార్యక్రమాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నా.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతోన్న ఈ సమయంలో.. కీలక నిర్ణయాలు ఉంటాయనే ప్రచారం సాగుతోంది.. ఇక, ఆ ప్రచారంపై స్పందించిన మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజా…
కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ తర్వాత వైసీపీ నేతల్లో అసమ్మతి బయటపడింది. పలు చోట్ల ఆ పార్టీ నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ జాబితాలో మేకతోటి సుచరిత, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వంటి మాజీ మంత్రులతో పాటు గొల్ల బాబూరావు, పార్థసారథి, సామినేని ఉదయభాను వంటి కీలక నేతలు ఉన్నారు. ఈ అసమ్మతి వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో సీఎం జగన్ వెంటనే మేల్కొన్నారు. పార్టీలో వివాదాలను పరిష్కరించడంపై ఫోకస్…
మంత్రి పదవి రాలేదని ఏపీలో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అనేక ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం అయ్యాయి. సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మంత్రి పదవి రాకపోవడంపై పిన్నెల్లిని బుజ్జగించారు సీఎం వైఎస్ జగన్. అనంతరం ఆయన మాట్లాడారు. మొదట్నుంచీ జగన్ కోసం, పార్టీకోసం పనిచేశాం. ఇప్పటివరకు నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఒకసారి వైఎస్, మూడు సార్లు జగన్ నాయకత్వంలో ఎమ్మెల్యే అయ్యా. సామాజిక…