ఏపీలో వైద్యరంగంలో అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. మహమ్మారిగా మారుతున్న క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు మంత్రి విడదల రజనీ. ఆర్కే బీచ్ లో కాన్సర్ అవగాహన వాకథాన్ నిర్వహించారు. ఈ వాకథాన్ లో పాల్గొన్న మంత్రి విడదల రజని ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. క్యాన్సర్ నివారణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, ఏపీ బడ్జెట్లో 400 కోట్ల రూపాయలను క్యాన్సర్ నివారణకు కేటాయించామన్నారు.
Read Also: Public Nudity: ఇక బట్టల్లేకుండా బజార్లలో తిరగొచ్చు.. కోర్టు సంచలన తీర్పు
కర్నూలులో 120 కోట్లతో క్యాన్సర్ కేర్ యూనిట్ ఏర్పాటు జరుగుతుంది. విశాఖ కేజీహెచ్ లో 60 కోట్లతో క్యాన్సర్ క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేశామన్నారు. క్యాన్సర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల బట్టి కోటి 60 లక్షల మంది ప్రతి ఏటా క్యాన్సర్ కు గురవుతున్నారు. 2030 నాటికి 30 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నట్టు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు చేసిందన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ కి హోమీబాబా క్యాన్సర్ కేర్ సెంటర్ తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు మంత్రి విడదల రజని.
Read Also: Bus Fire: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధం