ఢిల్లీలో ఈడీ బృందంపై భౌతిక దాడి జరిగింది. సైబర్ ఫ్రాడ్‌కు సంబంధించిన కేసును దర్యాప్తు చేయడానికి బృందం ఢిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతానికి చేరుకుంది. ఈడీ సోదాలు నిర్వహిస్తున్న సమయంలో కొంతమంది అక్కడకు వచ్చి వారి బృందంపై దాడి చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రాజెక్టులపై హరీష్ రావు విచారణ చేయండి అని అంటున్నారు.. ఖచ్చితంగా విచారణ చేస్తామని తెలిపారు. బాధ్యులను శిక్షిస్తామని చెప్పారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరం అయినా సాగు అదనంగా వచ్చిందా అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుకి ఎందుకు నిధులు విడుదల చేయలేదని ఆయన ప్రశ్నించారు. పాలమూరుకి రూ.25 వేల కోట్లు ఖర్చు పెడితే.. కొత్త ఆయకట్టు లేదని అన్నారు. సీతారాం ప్రాజెక్టుకి…
డ్రగ్స్ కేసులో హైదరాబాద్ కమినషర్ సీవీ ఆనంద్, ఎస్పీ సునీత రెడ్డి నేతృత్వంలో టీం బాగా పనిచేస్తోంది అని నవదీప్ ప్రశంసించారు. రామచంద్ అనే వ్యక్తి నాకు పరిచయం ఉన్నమాట వాస్తవమే.. కానీ, నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు అని అతడు చెప్పాడు.
హవానా సిండ్రోమ్ వ్యాధిపై ఇండియాలో కూడా కొంత ఆందోళన ఉంది. భారత్‌లో ఈ వ్యాధి వ్యాప్తికి సంబంధించి దేశంలో ఉందా? లేదా? అనేది స్పష్టంగా తెలియకపోయినప్పటికీ.. అనుమానాలు, ఆందోళన మాత్రం ఉంది.
మణిపూర్ అల్లర్లపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా జాతి హింసకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తుతో పాటు పునరావాసం, ఇతర అంశాలను కూడా పరిశీలించేందుకు ముగ్గురు మాజీ హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో విజయవాడ NIA కోర్టులో ఇవాళ ( సోమవారం ) విచారణ జరిగింది. సీఎం జగన్ తరపున లాయర్ ఇంకొల్లు వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఎన్ఐఏ పలు అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని.. అలాగే కుట్ర కోణంపైనా దర్యాప్తు చేయలేదని.. కాబట్టి తదుపరి దర్యాప్తు అవసరం ఉందని వాదించారు.