పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వేగవంతానికి చర్యలు చేపట్టి 2027 మార్చి నాటికి ఉదండాపూర్ వరకు నీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రాజెక్టుల కోసం భూ సేకరణకు సత్వర చర్యలకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నాం.. పాలమూరు జిల్లా గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైంది అని ఆరోపించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రాజెక్టులపై హరీష్ రావు విచారణ చేయండి అని అంటున్నారు.. ఖచ్చితంగా విచారణ చేస్తామని తెలిపారు. బాధ్యులను శిక్షిస్తామని చెప్పారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరం అయినా సాగు అదనంగా వచ్చిందా అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుకి ఎందుకు నిధులు విడుదల చేయలేదని ఆయన ప్రశ్నించారు. పాలమూరుకి రూ.25 వేల కోట్లు ఖర్చు పెడితే.. కొత్త ఆయకట్టు లేదని అన్నారు. సీతారాం ప్రాజెక్టుకి…