ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఓ ప్రైవేట్ పంక్షన్ హల్ లో కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ జన్మదిన వేడుకల్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్తుపల్లి నియోజకవర్గం కిర్తి ప్రతిష్ట నిలిపిన ప్రజలందరికి ధన్యవాదాలు చెప్పారు. నన్ను అక్కున చేర్చుకున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాడటానికి ప్రాధాన్యత గల నియోజకవర్గం సత్తుపల్లి.. గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఖమ్మం జిల్లా అభివృద్ధికి పాటు పడ్డాను.. నేను ఉన్న పార్టీ జెండా ఎగరాలని కోరుకున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు. సత్తుపల్లి ప్రజలు ధైర్యవంతులు.. రాగమయి గెలుపుతో సత్తుపల్లి సత్తా చూపించారు.. ప్రభుత్వ కార్యక్రమాలు ఏం చేపట్టిన సత్తుపల్లిలోనే ముందుగా చేపడతాను అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
సత్తుపల్లిలో రాగమయిని గెలిపించి నా గౌరవం కాపాడారు అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. స్వార్థం కోసం స్వలాభం కోసం చేసే బ్రతుకు మాకు అవసరం లేదు.. ఎల్లప్పుడూ మీ కోసం మీ బాగు కోసమే పని చేస్తాను.. సత్తుపల్లి ఏం కావాలన్న చేస్తానని ఆయన మాట ఇచ్చారు. గోదావరి జలాలు వైశ్య కాంతుల చేరువులోకి వస్తే నా జీవితం ధన్యం అవుతుంది.. కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ కు శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.