Indian Economy: జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. మొత్తం ప్రపంచ, ఆర్థిక వాతావరణం భారతదేశానికి అనుకూలంగా ఉందని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్.. నీతి ఆయోగ్ సీఈఓ బి.వి.ఆర్ సుబ్రహ్మణ్యంను కలిశారు. ఉత్పాదక రంగంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన పురోగతితో పాటు విజన్ 2047తో పాటు రానున్న ఐదేళ్లలో రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలపై చర్చించారు.
భారతదేశంలో పేదరిక నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పలు కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయని నీతి అయోగ్ తెలిపింది. అది జరిపిన తాజా సర్వేలో భారత్‌లో దాదాపు 5 శాతం మేర పేదరికం తగ్గిందని నీతి అయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం పేర్కొన్నారు.