ఆధునీకరించిన హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. దీంతో పాటు సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియం హాల్, టీయూడబ్ల్యూజే కార్యాలయాలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. నా మీద ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వాళ్ళకే రివర్స్ తగులుతాయన్నారు. నిజాయితీ గల వ్యక్తులకు గ్యారెంటీగా న్యాయం జరుగుతుందనే దానికి నేనే ఉదాహరణ అని అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో ఉపయోగపడిందని, ఈ హాల్ కు సురవరం ప్రతాప్ రెడ్డి పేరు ఉండడం వల్లే ఎంతో బలం వచ్చిందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న వారికి సురవరం వ్యతిరేకంగా ఉండేవారని, సురవరం వనపర్తి ఎమ్మెల్యే గా ఉండేవారు…కొంతమంది ఆయనను సీఎం అవ్వకుండా చేశారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. సురవరం కుల మతాలకు అతీతంగా పోరాడారని, ఉద్యమం సమయంలో మాకు కుల మత భేదాలు తెలియలేదన్నారు.
Also Read : Jacqueline Fernandez: బాలీవుడ్ నటి జాక్వెలిన్‌కు ఢిల్లీ కోర్టులో బిగ్ రిలీఫ్!
ఇప్పుడు కొన్ని చోట్ల కు వెళితే కులాల ను చూసి గౌరవిస్తున్నారని, కొన్ని నియోజకవర్గాలకు వెళితే.. మంత్రి గా ఉండి కూడా శిలాఫలకాల పై పేర్లు ఉండవన్నారు శ్రీనివాస్ గౌడ్. అవన్నీ చూస్తుంటే బాధ అవుతుందని, జర్నలిస్టుల కు తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రయోజనాలు చేస్తుందన్నారు. వనపర్తి జిల్లా కు సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. రాజకీయ వ్యవస్థలో ధనిక, కులం అనే దుర్మార్గమైన ఆలోచన ఉందని, భవిష్యత్తు తరాలకు సురవరం ప్రతాపరెడ్డి స్ఫూర్తి అన్నారు. కులం, మతం లేదు అందరం సమానం అని, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోమన్నారు. జిల్లాల్లో జర్నలిస్టులకు ఇళ్లు, స్థలాలు, అక్రిడేషన్, నిధి, హెల్త్ కార్డులను ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
Also Read : Jacqueline Fernandez: బాలీవుడ్ నటి జాక్వెలిన్‌కు ఢిల్లీ కోర్టులో బిగ్ రిలీఫ్!