మంచిర్యాల జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అభ్యర్థులను చూసి ఓటు వేయండని.. పెద్దపల్లిలో యువకుడి వంశీని ముందుంచామన్నారు. ఈ సందర్భంగా.. నేతకాని సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. తాము ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పనులకు కోడ్ వల్ల ఆటంకం కలిగింది.. 2018 ఎన్నికలు జరిగిన తరువాత రెండు నెలల తరువాత పాలన మొదలు పెట్టారన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో పథకాలను ప్రారంభించి పాలన మొదలు పెట్టామని చెప్పారు.
Anand Mahindra: కోతి దాడి నుండి మేనకోడలిని రక్షించిన అమ్మాయికి ఉద్యోగం ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా..!
గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెడుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 2 వందల యూనిట్ల ఫ్రీ కరెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. ఇవి బీఆర్ఎస్ పార్టీ వాళ్లు సైతం పొందుతున్నారన్నారు. రాష్ట్రంలో ఇవ్వన్నీ ఇస్తున్నాం అంటే ఓట్లు తమకే వేయాలన్నారు. మరోవైపు.. కేసీఆర్ ఆర్థిక వ్యవస్థను ఆగం చేసారని దుయ్యబట్టారు. 7 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని మంత్రి తెలిపారు. ఇదిలా ఉంటే.. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాక ఐదేళ్లు పాలన గడిచిన తరవాత ఇవ్వకపోతే అడగండని అన్నారు.
Rani Rudrama Devi: కాంగ్రెస్ మేనిఫెస్టోపై రాణి రుద్రమ కీలక వ్యాఖ్యలు..
బీఆర్ఎస్ పెద్దలు రైతులను లూటీ చేసారని మంత్రి ఆరోపించారు. పైగా ఇప్పుడు రైతుల కోసం అంటూ ధర్నాలు చేస్తున్నారు.. అలాంటి వారికి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. నీటి లభ్యత విషయంలో అక్టోబర్ మాసంలో తక్కువగా ఉందని వాళ్ల పత్రికలే రాసుకున్నారు.. ఇప్పుడేమో కాంగ్రెస్ వల్ల కరువు అంటున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే కరువు వచ్చింది అంటున్నారు.. కాళేశ్వరం వాళ్లు కట్టి కుంగిపోతే తాము ఏం చేయడం లేదని ఆరోపిస్తున్నారని మంత్రి తెలిపారు. కాళేశ్వరం నుంచి నీళ్ళు వదిలి పెట్టి మేము వదిలి పెట్టాం అని అబద్ధాలు చెప్పుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ బీఆర్ఎస్ ఒక్క సీటు గెలువదు.. కాబట్టి అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.