Sridhar Babu: పాఠ్యాంశాలు మార్చాలి.. విద్యా వ్యవస్థ ముఖచిత్రం మారాలి
- విద్యాశాఖ ఉన్నతాధికారులతో విద్యాసంస్కరణలపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష
- ఒకప్పుడు ప్రపంచానికి ప్రతిభావంతులను అందించిన ప్రభుత్వ స్కూళ్లు ఇప్పుడా పరిస్థితిలో లేవు
- ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడలేక పోతున్నాం: శ్రీధర్ బాబు
- ఆ కారణాలపై అధ్యయనం చేసి మార్పులకు శ్రీకారం చుట్టాలి: శ్రీధర్ బాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోమవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా ఇతర ఉన్నతాధికారులతో విద్యా సంస్కరణలపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. ఒకప్పుడు ప్రపంచానికి ప్రతిభావంతులను అందించిన ప్రభుత్వ స్కూళ్లు ఎందు వల్లనో ఇప్పుడా పరిస్థితిలో లేవని మంత్రి పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడలేక పోతున్నామని దీనికి దారితీసిన కారణాలపై అధ్యయనం చేసి మార్పులకు శ్రీకారం చుట్టాలని అధికారులకు తెలిపారు. స్కూళ్లలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగు పరచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులకు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.
Read Also: CM Chandrababu and Deputy CM Pawan Kalyan: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కీలక చర్చలు..
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు కూడా అత్యుత్తమ చదువులను అందించాలనేది సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇందుకు అనువైన పరిస్థితులను విద్యాశాఖ కల్పించాలి.. గుజరాత్ నుంచి ఏటా 30- 40 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు సింగపూర్‌కు వెళ్లి ఉన్నత శిక్షణ పొంది వస్తున్నారు.. ఆ తరహా ప్రయత్నం మన వద్ద కూడా జరగాలని అధికారులకు మంత్రి సూచించారు. ఫిన్లాండ్, ఫ్రాన్స్, యుకెలలోని విద్యా ప్రమాణాలపై అధ్యయనం చేసి మన వద్ద కూడా ఆ స్థాయి విద్యను ప్రవేశ పెట్టాలన్నారు. పాఠ్యాంశాలను మార్చాలి.. సింగపూర్ ప్రభుత్వం మన దగ్గర ప్రపంచస్థాయి విద్యా సంస్థలను ఏర్పాటు చేయడానికి అంగీకరించింది.. త్వరలోనే సింగపూర్ బృందం పర్యటిస్తుందని మంత్రి తెలిపారు. మన ఉపాధ్యాయులను కూడా ఇతర దేశాలకు పంపించి నైపుణ్యాలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. దానికి సంబంధించిన విధివిధానానలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
Read Also: Rashmika: కర్ణాటక ఎక్కడుందో తెలియదా? రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాలి!
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!