డైట్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీల పెంపు అమలుపై మంత్రి సీతక్క వివరణ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వంలో డైట్ చార్జెస్ ఏడేళ్ల తర్వాత 40% పెంచామన్నారు. 16 సంవత్సరాల తర్వాత ఇందిరమ్మ ప్రభుత్వంలో కాస్మోటిక్ ఛార్జీలు 212% పెంచామని తెలిపారు. నేను కూడా ఎస్టీ గర్ల్స్ హాస్టల్ ములుగులో చదివాను. ఆనాడు అవకాశాలు తక్కువగా ఉన్నా ఎంతోమంది పట్టుదలతో చదువుకొని అత్యున్నత స్థానాల్లోకి వచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఓసీలలో కూడా పేదలు పెద్ద ఎత్తున హాస్టల్ లోకి వస్తున్నారు. సరైన తిండి పౌష్టికాహారం లేకుంటే చదువుకునే టైంలో అర్థాకళితో కడుపు మాడుతుంటే చదువుకోవడం ఇబ్బందిగా ఉంటుందని సీతక్క తెలిపారు.
Also Read: KTR: రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. సీఎం ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నాడు
అందుకే పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున డైట్ చార్జీలు కాస్మోటిక్ చార్జీలు పెంచామన్నారు. పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది కాబట్టి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విద్యార్థులే దేశ మానవమనరులు. వారి జీవితాలను సమోన్నతంగా పెంచేందుకు వాళ్ళ నాలెడ్జ్ ను పెంచేందుకు పూర్తిస్థాయిలో బాధ్యత తీసుకొని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఆహారము కల్తీ జరిగితే చర్యలు తీసుకుంటున్నాం. మన ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు ఎమ్మెల్యేలు కూడా హాస్టల్లో బసచేస్తున్నారు. మంచి విద్య పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తున్నాం.
Also Read: KTR: రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. సీఎం ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నాడు
నాలుగు నెలల కాలంలో 499 కోట్లకుపైగా ఖర్చు చేశాం. కేంద్ర ప్రభుత్వం బడి పిల్లలకు స్కాలర్షిప్ లను రద్దు చేసింది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, నూతన విద్యా విధానమని పెద్దపెద్ద మాటలు చెప్పి విద్యార్థులకు అందే స్కాలర్షిప్ ల విధానాన్ని రద్దు చేసింది. విద్యారంగం మీద కేంద్ర ప్రభుత్వ వైఖరి బొట్టుపెట్టుడే తప్ప బోనం లేదన్నట్టుగా ఉంది. ప్రభుత్వ విద్య బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు పెంచాలి. పేద మధ్యతరగతి కుటుంబీకులే ప్రభుత్వము మీద ఆధారపడతారు కాబట్టి కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని సీతక్క కోరారు.