ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 25, 26 తేదీల్లో కలెక్టర్ సమావేశాలు జరుగనున్నాయి. రేపటి నుంచి రెండు రోజులపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరుగనున్నది. రేపు ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభంకానుంది. ఉదయం 10 గంటలకు సీసీఎల్ఏ ప్రారంభ ఉపన్యాసం జరుగనుంది. ఆ తర్వాత సీఎస్.. రెవెన్యు మంత్రి.. ఆర్ధిక మంత్రి ప్రసంగాలు ఉండనున్నాయి.
Also Read:Rishabh Pant: రూ. 27 కోట్లు గంగలో కలిసినట్లేనా..? రిషబ్ పంత్ ప్లాప్ షో!
తర్వాత సీఎం చంద్రబాబు.. కలెక్టర్ల సమావేశాన్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. మొదటి రోజు వాట్సాప్ గవర్నెన్స్.. ఆర్టీజీఎస్… ల్యాండ్ సర్వే.. వేసవి నీటి ఎద్దడి గ్రామీణ.. పట్టణ ప్రాంత నీటి సరఫరాపై చర్చించనున్నారు. జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్… ముఖ్య సమస్యల ప్రస్తావన.. జిల్లాల వారీగా ఆదాయ మార్గాలు.. రెవెన్యూ సమస్యలు.. భూ సమస్యలపై మొదటి రోజు చర్చించనున్నారు.