Minister Seediri Appalaraju: చంద్రబాబుకు కుల పిచ్చి.. ఆయన సామాజిక వర్గం వారికే పదవులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seediri Appalaraju: చంద్రబాబుకు కుల పిచ్చి ఎక్కువ.. ఆయన సామాజిక వర్గంవారికే పదవులు కట్టబెడతారని ఆరోపించారు మంత్రి సీదిరి అప్పలరాజు.. నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు.. మంత్రి అప్పలరాజుతో పాటు పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు.. రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ రావు, జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. సామాజిక సాధికార యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన కొందరికి కనిపించడం లేదు.. కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఇక, సమాజంలో రూపం మార్చుకున్న అంటరానితనాన్ని సీఎం వైఎస్ జగన్ అంతం చేశారని తెలిపారు అప్పలరాజు.. చంద్రబాబుకు కుల పిచ్చి ఎక్కువ.. ఆయన సామాజిక వర్గం వారికే పదవులు ఇస్తారన్న ఆయన.. జన్మభూమి కమిటీల పేరుతో పేదలకు సంక్షేమ పథకాలు అందనివ్వకుండా చంద్రబాబు చేశారని ఆరోపించారు. అప్పట్లో కలెక్టర్ల కు కూడా పథకాలు మంజూరు చేసే అధికారం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్టంలో ఒక మెడికల్ కాలేజ్ కూడా కట్టని దౌర్బాగ్యుడు చంద్రబాబు అని మండిపడ్డారు. బీసీలు జడ్జీలుగా పనికిరారని లేఖ రాసిన చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బీసీలే బుద్ధి చెబుతారు అంటూ జోస్యం చెప్పారు.. దళితులను కించపరుస్తూ మాట్లాడిన చంద్రబాబును దళితులు గుర్తుపెట్టుకోవాలి సూచించారు మంత్రి సీదిరి అప్పలరాజు.
Also Read
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన మాట తప్పరని వైఎస్ జగన్ పై ప్రజల్లో నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వం ద్వారా ఒకో కుటుంబానికి వేల రూపాయల మేర లబ్ది చేకూరుతోందని వెల్లడించారు. కావలికి రామాయపట్నం పోర్టు రావడం ప్రజల అదృష్టం.. దీని ద్వారా కావలి కనక పట్నం కాబోతుందన్నారు. జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బార్ ను త్వరలోనే సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారని తెలిపారు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి.
తాజావార్తలు
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
-
Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
-
LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!