ప్రజల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నమ్మకం లేదన్నారు మంత్రి ఆర్ కె రోజా. నగరి నియోజవర్గం పూడి గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం చేపట్టిన మంత్రి రోజా విపక్షాలపై మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ కళ్యాణ్ జగన్ ,నన్ను ఓడిస్తారని అనుకోవడం అవివేకం ..కలవాలి ఆలోచన పవన్ కి, చంద్రబాబు ఉంటే కలగకుండా ఎవరైనా చేయగలరా.. ప్రజల్లో పవన్ కల్యాణ్ పై నమ్మకం లేదు. పార్టీ పెట్టి పవన్ ఏం చేస్తున్నాడు…చంద్రబాబు లా మ్యానిఫెస్టో వెబ్ సైట్ నుండి తీసేయలేదన్నారు రోజా.
ఈ కార్యక్రమంలో ఎదురు తిరిగి ప్రశ్నించి మాట్లాడేవారు మూర్ఖులు. జగన్ననే మా భవిష్యత్తు లో ప్రజల నుండి గత ప్రభుత్వ పాలన ఇప్పుడు మా పాలన కు సంబంధించి వారి అభిప్రాయం తెలుసుకునే కార్యక్రమం..ఐదు అంశాలపై ప్రజల నుండి అభిప్రాయం సేకరించి వారు ఈ ప్రభుత్వంపై విశ్వాసం చూపితే వారి ఇంటికి వారి అనుమతితో మా నమ్మకం నువ్వే జగన్ స్టికర్ ను వారి ఇంటికి అంటిస్తాం. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ లు ఏర్పాటు చేసి ఏ విధంగా పరిపాలన అందించారో మనం చూసాం..మా ముఖ్యమంత్రి లబ్దిదారుడికి అర్హత ఉంటే చాలు వారికి నేరుగా పధకాలు అందజేయమని చెప్పారన్నారు.
Read Also:Rajasthan Royals : చాహల్ తో కలిసి డ్యాన్స్ చేసిన జో రూట్
ఇది ఒక గొప్ప కార్యక్రమం..దేశ చరిత్రలోనే మొదటిసారి ఇలాంటి విస్తృత కార్యక్రమం చేపట్టామన్నారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాం. అందుకే 7 లక్షల మంది సైన్యంతో వైసీపీ ప్రతి ఇంటికి వెళుతుంది. రాష్ట్రంలోని కోటి 60 లక్షల కుటుంబాలకు వెళ్ళనున్నారు అన్నారు అయోధ్య రామిరెడ్డి.
రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ..గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం కనుకే ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం.గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను జలగల్లా పీల్చుకుని తిన్నారు. మా ప్రభుత్వంలో కులాల, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. 20వ తేదీ తర్వాత ప్రజల నుంచి వచ్చిన సర్వే ఫలితాలను మళ్ళీ ప్రజల ముందు పెడతాం… మా నమ్మకం నువ్వే జగన్ అన్నది ప్రజల నుంచి వచ్చిన నినాదం అన్నారు మర్రి రాజశేఖర్.
Read Also: Rajasthan Royals : చాహల్ తో కలిసి డ్యాన్స్ చేసిన జో రూట్