Pink Moon: ఈ పౌర్ణమి రోజున చంద్రుడిని ‘‘పింక్ మూన్’’గా పిలుస్తున్నారు. అయితే చంద్రుడు పింక్ కలర్ లో కనిపించకున్నా ఎందుకు ఈ పేరుతో పిలుస్తున్నారో తెలుసా..? అయితే దీని వెనక ఓ స్టోరీ ఉంది. పింక్ మూన్ విషయానికి వస్తే గురువారం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు పింక్ మూన్ దర్శనం ఇస్తుంది.
Read Also: Mallu Bhatti Vikramarka: మోడీ జీ.. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పి.. తెలంగాణలో అడుగుపెట్టండి
వసంత కాలంలో మొదటి పౌర్ణమిని పింక్ మూన్ గా పిలుస్తారు. నిజానికి చంద్రుడు గులాబీ కలర్ లో కనిపించడు కానీ వసంతకాలంలో మొదటి పౌర్ణమిని ఈ పేరుతో వ్యవహరిస్తుంటారు. ఓల్డ్ ఫార్మర్స్ అల్మానాక్ ప్రకారం.. ఈ పేరు ‘ప్లోక్స్ సుబులాట’’ను సూచిస్తుంది. ఇది ఓ రకమైన పింక్ కలర్ వైల్డ్ ఫ్లవర్. ఇది ఉత్తర అమెరికాలో వసంతకాలం ప్రారంభంలో వికసిస్తుంది. ఈ పువ్వులను క్రీపింగ్ ఫ్లోక్స్, మోస్ ఫ్లోక్స్, మోస్ పింక్ అని కూడా పిలుస్తుంటారు. 1930 నుంచి ఇలా పౌర్ణమి రోజు చంద్రుడికి పేర్లు పెట్టడం ప్రారంభం అయింది.
పలు దేశాల్లో సాంప్రదాయాలను బట్టి పౌర్ణమి చంద్రుడికి పేర్లు పెడుతుంటారు. క్రిస్టియన్ క్యాలెండర్లలో ఏప్రిల్ పౌర్ణమిని సాస్చల్ మూన్ అని పిలుస్తారు. ఇది ఈస్టర్ రాకను సూచిస్తుంది. చంద్రుడిని జూడాయిజంలో పెసాచ్ లేదా పాస్ ఓవర్ మూన్ అని, బౌద్ధమతంలో బక్ పోయాగా పిలుస్తారు. హిందూమతంలో ఏప్రిల్ పౌర్ణమి చైత్రమాసంలో వస్తుంది. ఇక ఇస్లామిక్ క్యాలెండర్ లో రంజాన్ మాసంలో వస్తుంది.