Ponnam Prabhakar: గతంలో పెళ్లై పిల్లలు పుట్టిన తరువాత చెక్కులు తీసుకునే పరిస్థితి..
- శాసనమండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అడిగిన ప్రశ్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం
- మహిళలకు గత 10 సంవత్సరాల కంటే మెరుగైన పథకాలు
- గతంలో పెళ్లై పిల్లలు పుట్టిన తరువాత చెక్కులు తీసుకునే పరిస్థితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ శాసన సభ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శాసనమండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అడిగిన ప్రశ్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం మహిళలకు గత 10 సంవత్సరాల కంటే మెరుగైన పథకాలు తీసుకొస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. కళ్యాణ లక్ష్మి పేరు మార్చి కళ్యాణ మస్తు గా మార్చాలని అనుకున్నాం.. అది భవిష్యత్ లో అమలు చేస్తామని అన్నారు.
Also Read:US: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసుల మృతి
Also Read
బలహీన వర్గాలకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. కళ్యాణలక్ష్మి , షాది ముబారక్ ల పేరు మార్చలేదు. గత ప్రభుత్వం రెండు, మూడు సంవత్సరాలుగా పెట్టిన కళ్యాణ లక్ష్మి బకాయిలు మేము విడుదల చేశామని పొన్నం అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నిధులకు కళ్యాణ లక్ష్మి నిధులకు సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేదు అని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో వివాహాలు చేసుకునే వారికి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు.
Also Read:IML 2025: ఫైనల్ మ్యాచ్ లో యువరాజ్ సింగ్, టినో బెస్ట్ మధ్య గొడవ.. వీడియో వైరల్
గతంలో పెళ్లై పిల్లలు పుట్టిన తరువాత చెక్కులు తీసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు బకాయిలు లేకుండా చూసుకుంటున్నం.. వెంటనే చెల్లిస్తున్నామని పొన్నం తెలిపారు. కళ్యాణ లక్ష్మి పెండింగ్ బకాయిలపై ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. బాల్య వివాహాలు నివారించాలని మేము కూడా ముందుకు పోతున్నాం.. కళ్యాణ లక్ష్మి బరా బర్ కొనసాగిస్తున్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..