Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Minister Ponguleti Srinivasa Reddy Gave A Big Update On Indiramma Houses

Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన..

Published Date :December 24, 2024 , 8:50 pm
By Rajesh Veeramalla
  • ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి బిగ్ అప్ డేట్
  • కొత్త ఏడాదిలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం షురూ- మంత్రి పొంగులేటి
  • 33 జిల్లాల‌కు ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ల నియామ‌కం- పొంగులేటి
  • ఇందిర‌మ్మ‌ యాప్ ద్వారా ఇప్ప‌టికే 32 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌- మంత్రి.
Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి బిగ్ అప్ డేట్ ఇచ్చారు. కొత్త ఏడాదిలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం షురూ అవుతుందని తెలిపారు. ఈ క్రమంలో.. 33 జిల్లాల‌కు ప్రాజెక్ట్ డైరెక్టర్లను నియమించామని.. ఇందిర‌మ్మ యాప్ ద్వారా ఇప్పటికే 32 ల‌క్షల ద‌ర‌ఖాస్తులు ప‌రిశీలించామని తెలిపారు. మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తామని.. తొలి విడతలో దివ్యాంగులు, వితంతువులకు అవకాశం ఇస్తామన్నారు. ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక సర్వేపై అధికారులతో చర్చించారు. అనంతరం.. కీలక ఆదేశాలు జారీ చేశారు.

Read Also: JK: విషాదం.. లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. ఐదుగురు జవాన్ల మృతి

ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని.. దరఖాస్తుల ఆధారంగా ఇంటింటికీ వెళ్లి సర్వే పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. రేషన్ కార్డులతో సంబంధం లేకుండా సొంతంగా స్థలం ఉంటే ప్రాధాన్యం ఇస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం ఒక్క అడుగు వెనక్కి వేయదని అన్నారు. ఎలాంటి ప్రలోభాలు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఉండొద్దని చెప్పారు. రాబోయే రెండు రోజుల్లో ఒక వెబ్ సైట్‌ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాగా.. ఇందిరమ్మ కమిటీలు అర్హులను ఎంపిక చేస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబ‌ర్‌, వెబ్‌సైట్‌ ను సంప్రదించాలన్నారు.

Read Also: Srisailam Temple: జనవరి 1న శ్రీశైలంలో స్పర్శదర్శనాలు, ఆర్జిత అభిషేకాలు నిలిపివేత

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #big update
  • indiramma houses
  • Ponguleti Srinivasa Reddy
  • telugu news

తాజావార్తలు

  • Varanasi: క్లైమాక్స్‌కు చేరువలో ‘వారణాసి’..హైదరాబాద్ శివార్లలో షూటింగ్

  • Iran War: యూఏఈపై 450 క్షిపణి, 2,000 డ్రోన్ దాడులు.. అయినా యూఏఈ ఇరాన్‌తో ఎందుకు పోరాడటం లేదు..?

  • Tamil Nadu Elections: తమిళనాడులో గెలిచేదెవరు.? తాజా సర్వేలో సంచలన ఫలితాలు..

  • Viral News: ‘పోలీస్ మామల స్క్వాడ్’.. మందుబాబుల వాట్సాప్ గ్రూప్‌లో షాకిచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ

  • Botsa Satyanarayana: అమరావతిపై తీర్మానం చేసినంత మాత్రాన పర్మినెంట్‌ కాదు.. బొత్స సంచలనం

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions