ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఇందిరమ్మ ఇళ్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా ఇన్‌ఛార్జి మంత్రులు ఆమోదం తప్పని సరి అని పేర్కొన్నారు. ఇళ్లు విస్తీర్ణం 600 చదరపు అడుగులు మించకూడదని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో పట్టణప్రాంతంలో 500 ఇళ్లు నిర్మించాలని స్పష్టం చేశారు. ఈ నెల 5 నుంచి 20 వరకు 28 మండలాల్లో భూభారతి సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
READ MORE: Off The Record: వైసీపీ వాళ్ళయినా ఒకే.. ఇవ్వాల్సింది ఇస్తే చాలు అంటున్న కూటమి ఎమ్మెల్యే కొండబాబు?
సచివాలయం నుంచిలో సీఎస్ రామకృష్ణారావుతో కలిసి భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్ష ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి పొగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులని తేలితే ఇళ్ల నిర్మాణం మధ్యలో ఉన్నా సరే రద్దు చేస్తామని, జాబితా -1, జాబితా -2, జాబితా -3లతో సంబంధం లేకుండా నిరుపేదలను ఎంపిక చేయాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ఈ నెల 4న జరగనున్న నీట్ పరీక్షకు ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 72,572 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరవుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందుకోసం 24 జిల్లాల్లో 190 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని సూచించారు.
READ MORE:Gold Price: భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఇంకా తగ్గుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే?