Kothwalguda Eco Park: కొత్వాల్ గూడ ఎకో పార్కుని ప్రభుత్వ ప్రధాన సలహాదారు రామకృష్ణారావు, MAUD సెక్రెటరీ ఇలంబర్తి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా 85 ఎకరాల విస్తీర్ణంలో 75 కోట్ల రూపాయల వ్యయంతో హెచ్ఎండీఏ కొత్వాల్ గూడ ఎకో పార్కును నిర్మించింది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 36 మంది అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్‌ను నియమించింది. గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేశ్ కుమార్‌ను బదిలీ చేసింది. ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్,…
CS Ramakrishna Rao: నేడు (మే 13) సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన రాష్ట్రంలోని ప్రభుత్వ సాంఘిక, గిరిజన, మైనారిటీ వసతి గృహాల నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్రంలోని వివిధ సోషల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ వసతి గృహాలలో మెరుగైన సేవలు అందించడానికి తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు సీఎస్ రామకృష్ణారావు. విద్యార్ధులకు అందించే కాస్మోటిక్ ఛార్జీల చెల్లింపులను నేరుగా విద్యార్ధుల బ్యాంక్ అకౌంట్…
ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఇందిరమ్మ ఇళ్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా ఇన్‌ఛార్జి మంత్రులు ఆమోదం తప్పని సరి అని పేర్కొన్నారు. ఇళ్లు విస్తీర్ణం 600 చదరపు అడుగులు మించకూడదని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో పట్టణప్రాంతంలో 500 ఇళ్లు నిర్మించాలని స్పష్టం చేశారు. ఈ నెల 5 నుంచి 20 వరకు 28 మండలాల్లో…