Gold Price: గత వారం రోజుల క్రితం వరకు ఎడపెడ పెరిగేసిన బంగారం ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన నాలుగైదు రోజుల నుంచి వరుసగా బంగారం ధరలు తగుత్తున్నాయి. తులం బంగారం రూ. 1,00,000 మార్క్ ను దాటి మళ్లీ రూ. 7000 వరకు తగ్గి ప్రస్తుతం 95 వేల వద్ద ట్రేడ్ అవుతుంది. దీనితో ప్రజలు ఇప్పుడు బంగారం కొనాలా? వద్దా? అనే సంశయంలో పడిపోయారు.. దీనికి కారణం.. దాదాపు 7,000 వరకు తగ్గిన బంగారం మరి కాస్త తగ్గుతుందేమో అన్న ఆలోచనలో ఉండిపోతున్నారు. గతవారం గ్లోబల్ మార్కెట్లో హౌస్ బంగారం ధర 3500 డాలర్ల వద్ద ట్రేడ్ జరగగా, తాజాగా 3215 డాలర్ల వద్ద ట్రేడ్ జరిగింది. అయితే ఇందుకు కారణాలు లేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ఉద్రికతలు తగ్గిన నేపథ్యంలో బంగారం లాంటి సురక్షితమైన ఆస్తులకు డిమాండ్ పడిపోయింది. దీంతో పెట్టుబడిదారులు బంగారం ధర తగ్గడంతో మరోమారు బంగారం కొనుగోళ్లు చేయడానికి సిద్ధమయ్యారు.
Read Also: Group 1 Exams 2025: రేపటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. షెడ్యూల్ ఇదే!
ప్రపంచ వాణిజ్య ఒప్పందాల సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాతో ఒప్పందం గురించి సానుకుల వ్యాఖ్యలు చేయడంతో బంగారం ధరల తగ్గుదలకు కారణంగా చెప్పుకోవచ్చు. అయితే కొందరు నిపుణులు తగ్గుదల కేవలం కొద్ది రోజులు మాత్రమేనని.. మళ్లీ బంగారం ధరలు ఆకాశాన్ని అంతటాయని అంచనా వేస్తున్నారు. కాబట్టి, ఎవరైనా బంగారం కొనుగోలు చేయాలని భావిస్తే.. మరికొన్ని రోజులు ఆగి మార్కెట్ స్థితిగతులను అర్థం చేసుకొని కొనుగోలు చేస్తే మంచిదని మరికొందరు నిపుణులు వారి అభిప్రాయాన్ని చెబుతున్నారు.