Peddireddy Ramachandra Reddy: ఆంధ్రప్రదేశ్‌లో పులల సంఖ్య రెట్టింపు అయ్యిందని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తిరుపతి ఎస్వీ జూ పార్క్ లో నిర్వహించిన గ్లోబల్ టైగర్స్ డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పులుల సంరక్షణ కు బీజం పడింది.. అందుకే ప్రతీ ఏడాది జులై 29న గ్లోబల్ టైగర్స్ డే జరుపుకుంటున్నాం.. మన రాష్ట్రంలో పులుల సంరక్షణలో గణనీయమైన అభివృద్ధి జరిగిందన్నారు. నల్లమల ఫారెస్ట్ నుండి శేషాచలం ఫారెస్ట్ వరకు టైగర్ రిజర్వ్ కు విస్తరించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాధనలు సిద్దం చేస్తున్నాం.. తద్వారా అటవీ సంరక్షణ సులువు అవుతుందన్నారు.. పులుల సంరక్షణకు మరింత పటిష్ట చర్యలు చేపడుతామని ప్రకటించారు.. గతంలో కేవలం పులుల కాలి ముద్రలనుబట్టి సంఖ్య లెక్కించే వాళ్ళు.. కానీ, ఇప్పుడు అధునాతనమైన సాంకేతికతతో అది మరింత సులువుగా మారిందని.. మన దగ్గర పులుల సంఖ్య రెట్టింపు అయ్యిందని సంతోషం వ్యక్తం చేశారు. అధికారులు పులుల సంరక్షణ కు నిరంతరం కృషి చేస్తున్నారు.. వారందరినీ అభినంధిస్తున్నట్టు వెల్లడించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Read Also: TS Govt: మైనార్టీలకు రూ.లక్ష సాయం.. ఆగస్టు 14 వరకు ధరఖాస్తుల స్వీకరణ
కాగా, అంతరించిపోతున్న పెద్ద పులల గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం జులై 29న గ్లోబల్ టైగర్ డేని జరుపుకుంటున్న విషయం విదితమే.. 13 టైగర్ శ్రేణి దేశాలు కలిసి 2010లో ఈ దినోత్సవాన్ని స్థాపించారు. అప్పటి నుంచి క్రమంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.. గ్లోబల్ టైగర్ డేలో ప్రభుత్వాలు, స్వచ్చంధ సంస్థలు, సెలబ్రిటీలు, ప్రభుత్వ అధికారులు, కుటుంబాలు, స్నేహితులు మరియు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రచారానికి మద్దతుగా నిలుస్తున్నారు.. పులులను రెట్టింపు చేయడం అనే లక్ష్యంతో గ్లోబల్ టైగర్ డేని విస్తృతంగా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.