రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒక సెన్సేషన్… సినిమాలతో మాత్రమే కాదు ఆర్జీవీ ఏ విషయంలో మాట్లాడినా అదో సంచలనమే. సినిమాలు, రాజకీయాలు కాకుండా వర్మ అమ్మాయిల గురించి కూడా అద్భుతంగా మాట్లాడుతాడు. ఏ అమ్మాయి ఎలా ఉంటే బాగుంటుంది? ఎలా చూపిస్తే బాగుంటుంది? ఏ కెమెరా యాంగిల్ లో అమ్మాయి బ్యూటిఫుల్ గా ఉంటుంది అని వర్మకి తెలిసినంతగా ఏ దర్శకుడికి తెలియదేమో. అందుకే వర్మ సినిమాల్లోని హీరోయిన్స్ అందంగా, హాట్ గా కనిపిస్తూ ఉంటారు. శ్రీదేవి నుంచి రంగీలా ఊర్వశి వరకు… ఇప్పుడు అప్సరా రాణీతో సహా అందరూ తెరపై కనిపించి కుర్రాళ్లకి పగటి కలలు తెచ్చిన వాళ్లే. ఎప్పటికప్పుడు కొత్త అందం కోసం చూసే రామ్ గోపాల్ వర్మ, లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఈ అమ్మాయి ఎవరో తెలిస్తే చెప్పండి అంటూ పోస్ట్ చేసాడు.
వర్మ పోస్ట్ చేసిన వీడియోలో అమ్మాయి సారీ కట్టుకోని, ఒక కెమెరా పట్టుకోని… అటు ట్రెడిషనల్ కి, ఇటు హాట్ నెస్ కి మధ్యలో ఉంది. వర్మ ఒక అమ్మాయి గురించి అడిగాడు అంటే కుర్రాళ్లు సైలెంట్ గా ఉంటారా? ముల్లోకాల్లో ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా అడ్రెస్ పట్టుకోని వచ్చేయరూ… ఇప్పుడు జరిగింది కూడా అదే. వర్మ అలా అమ్మాయి గురించి పోస్ట్ చేసాడో లేదో… ఆ అమ్మాయి అసలు పేరు “శ్రీలక్ష్మి సతీష్” ఇన్స్టా మోడల్, కేరళకి చెందిన అమ్మాయి అంటూ ఫుల్ డీటైల్స్ ఇచ్చేసారు. వర్మని అంతగా మెప్పించిన అమ్మాయి ప్రొఫైల్ చూసిన వాళ్లు, కళ్లు పడ్డాయా? అని కొంతమంది.. ఏ రాజా ఈ అమ్మాయికి కూడా బ్రేక్ ఇస్తావా అంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. వర్మ అనుకోవాలే కానీ బ్రేక్ ఏంటి కెరీర్ సెట్ కూడా అయిపోతది. మరి ఈ కేరళ కుట్టి శ్రీలక్ష్మీ సతీష్ వర్మ నుంచి రాబోయే ఏ సినిమాలో కనిపిస్తుందో చూడాలి.
Can someone tell me who she is ? pic.twitter.com/DGiPEigq2J
— Ram Gopal Varma (@RGVzoomin) September 27, 2023