Nara Bhuvaneshwari: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉండగా.. ఆయనకు మద్దతుగా.. ఆయనపై అక్రమ కేసులు పెట్టారంటూ టీడీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. ఇక, ఈ కార్యక్రమాల్లో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా పాల్గొంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో మహిళలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలలో పాల్గొన్నారు భువనేశ్వరి.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు తప్పు చెయ్యలేదు కనకనే ఇంతమంది మహిళలు ఇక్కడికి వచ్చారన్నారు. అధికారులకు కూడా బాబుగారు తప్పు చెయ్యలేదని తెలిసి ఎటువంటి ప్రశ్నలు అడగలేకపోయారన్న ఆమె.. ఏమీ తెలియని నాకు ఒక కంపెనీ భాద్యత అప్పగించారు.. చంద్రబాబుకి మహిళలపై నమ్మకం ఉందన్నారు.
Read Also: Xiaomi 13T Pro Price: ఐఫోన్ 15కి పోటీగా ‘షావోమి’ స్మార్ట్‌ఫోన్.. బలమైన బ్యాటరీ, సూపర్ ఫీచర్స్!
అయితే, పెద్దాయన (చంద్రబాబు)ను హింసిస్తే, మహిళలు ఊరుకోరు అని హింసించారు భువనేశ్వరి.. అన్ని వర్గాల మహిళలు చంద్రబాబుపై చూపుతున్న అభిమానాన్ని మరచిపోలేం.. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా చేయి, చేయి కలిపి ముందుకు వెళ్దాం అని పిలుపునిచ్చారు. ఆధారాల్లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని.. వాస్తవాలు తెలుసుకోకుండా, ఎలాంటి విచారణ లేకుండా ఆయన్ను నిర్భంధించారంటూ మండిపడ్డారు.. చంద్రబాబు ఏం తప్పు చేశారో ఇప్పటికీ నిరూపించలేకపోయారని దుయ్యబట్టారు.. ఇక, సేవ్ డెమోక్రసి, సత్యమేవ జయతే అంటూ రిలే నిరాహార దీక్షలో మహిళలతో నినాదాలు చేయించారు నారా భువనేశ్వరి.