ఓ వ్యక్తిపై కొండచిలువ దాడికి యత్నించింది. అతను తృటిలో తప్పించుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వ్యక్తి శక్తివంతమైన పామైన కొండచిలువను బల్లిలా భావించినట్టున్నాడు. 2 సెకన్లు అప్రమత్తంగా ఉంటే చాలా నష్టపోవాల్సి వచ్చేది. కేవలం 8 సెకన్ల ఈ క్లిప్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటివరకు 7 కోట్ల వ్యూస్ వచ్చాయి. 2 లక్షల 20 వేల మందికి పైగా వినియోగదారులు కూడా ఈ క్లిప్‌ను లైక్ చేసారు. వీడియో మీరు మొదట సారి చూస్తున్నట్లయితే.. ఫోన్‌ను జాగ్రత్తగా పట్టుకోండి. ఎందుకంటే చేతి నుంచి జారిపడే అవకాశం లేకపోలేదు.
READ MORE: Festival Rush: బెజవాడలో ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్, రైల్వే స్టేషన్..
తృటిలో ప్రాణాలను…
ఈ వీడియోలో చేతిలో టార్చ్ పట్టుకున్న వ్యక్తి చెక్క షెడ్డుతో కప్పబడిన బాల్కనీని పైకెత్తి కొండచిలువ కోసం వెతుకుతున్నట్లు చూడవచ్చు. మొదట బాల్కనీలో దాచిన కొండచిలువ ఆ వ్యక్తికి కనిపించదు. ఆయన టార్చ్ తో దాన్ని వెతికేందుకు ప్రయత్నిస్తాడు. అది ఒక్కసారిగా ఆ వ్యక్తిపైకి దూకి దాడి చేసింది. ఆ వ్యక్తి తృటిలో తప్పించుకుని ప్రాణాలు కాపాడుకుంటాడు. కొండచిలువ-మానవుని మధ్య జరిగిన ఈ టగ్-ఆఫ్-వార్‌పై వినియోగదారులు తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు.
READ MORE:Bengaluru: సోషల్ మీడియాలో వివాహితకు ఉద్యోగి బెదిరింపులు.. కంపెనీ ఏం చేసిందంటే..!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై వినియోగదారులు కూడా తీవ్రంగా కామెంట్ చేస్తున్నారు. క్లిప్‌లో కనిపించే చీకటిని చూసిన వినియోగదారులు ఇలా జరగడం వెనుక చీకటి కారణమని అంటున్నారు. కొంతమంది వినియోగదారులు ఆ వ్యక్తి తనను తాను రక్షించుకోవడానికి హెల్మెట్ ధరించి ఉండాల్సిందని రాసుకొచ్చారు. ఓ వ్యక్తి వ్యంగంగా “కొండచిలువ యొక్క లక్ష్యం ‘బోర్డ్‌తో హెడ్‌షాట్ కొట్టడం’ అని నేను అనుకున్నాను” అని పేర్కొన్నాడు. చాలా మంది వినియోగదారులు ఈ క్లిప్‌కి మిశ్రమ స్పందనలు ఇస్తున్నారు.