మన నేలపై ఉత్పత్తయ్యే విద్యుత్ రాష్ట్రానికే కాకుండా.. భారతదేశానికి మొత్తం సరఫరా చేస్తాం అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ సోలార్ ప్రాజెక్ట్ ద్వారా విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయన్నారు. రెన్యువబుల్ ఎనర్జీ పరిశ్రమ మాత్రమే కాదు ఉద్యమం అని పేర్కొన్నారు. భారత క్లీన్ ఎనర్జీ విప్లవానికి శంకుస్థాపన చేశాం అని, ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీకి అనుగుణంగా ప్జాజెక్ట్ రూపకల్పన చేశామని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. త్వరలోనే కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తామని మంత్రి లోకేశ్ చెప్పుకొచ్చారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లిలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్‌కు నారా లోకేశ్ భూమిపూజ చేశారు. 2,300 ఎకరాల్లో రూ.22వేల కోట్లతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు.
రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ భూమిపూజ అనంతరం మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ… ‘వైసీపీ హయాంలో రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదు. ఈ సోలార్ ప్రాజెక్ట్ ద్వారా విద్యుత్ చార్జీలు తగ్గుతాయి. మన ఆంధ్ర రాష్ట్రం నుంచి భారతదేశానికి మొత్తం మనమే విద్యుత్ సరఫరా చేస్తాం. గడచిన ఐదు సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క రోడ్డు వేయలేదు, రోడ్డుపై ఉన్న గుంతలను కూడా పూడ్చలేదు. రెన్యువబుల్ ఎనర్జీ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం. భారత క్లీన్ ఎనర్జీ విప్లవానికి శంకుస్థాపన చేశాం. ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీకి అనుగుణంగా ప్జాజెక్ట్ రూపకల్పన చేశాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే మా నినాదం. అనంతపురానికి కియా మోటార్ల పరిశ్రమ తెచ్చాం. మేక్ ఇన్ ఇండియా ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తాం. వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల కాలంలో సర్వనాశనం చేశారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీ విక్టరీ సాధించిన తర్వాత రాష్ట్రం పురోగతి సాధించింది’ అని అన్నారు.
Also Read: Ramprasad Reddy: త్వరలోనే జగన్, పెద్దిరెడ్డి, రోజా జైలుకు పోతారు!
‘కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ తీసుకొస్తాం. రాయలసీమ ప్రకాశం జిల్లాలో సోలార్ గ్రీన్ ఎనర్జీగా తీర్చిదిద్దుతాం. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీని కూడా రాయలసీమకు తీసుకొస్తాం. ఎన్డీఏ కూటమి 11 నెలలోనే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిలో ముందుకు వెళుతున్నాం. ప్రజలు ఆశీస్సులు ఉంటే రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్విభజన చేసిన తర్వాత రాజధాని ఎక్కడో తెలియదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అమరావతిగా తీర్చిదిద్దుతున్నారు. 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేశారు’ అని మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు.