ICC T20 World Cup 2026 Schedule: 2026 ICC పురుషుల T20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ అధికారికంగా బయటకు వెళ్లింది. బంగ్లాదేశ్ తన మ్యాచ్‌ను శ్రీలంకకు మార్చాలని పట్టుబట్టిన విషయం తెలిసిందే. కానీ క్రికెట్ పాలక మండలి దానికి ఒప్పుకోలేదు. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ T20 ప్రపంచ కప్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ జట్టు గ్రూప్ సిలో ఉంది. ఈ గ్రూప్‌లో వెస్టిండీస్, ఇంగ్లాండ్, నేపాల్, ఇటలీ కూడా ఉన్నాయి. స్కాట్లాండ్ తన మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 7న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 9, 14 తేదీల్లో అదే వేదికపై వరుసగా ఇటలీ, ఇంగ్లాండ్‌తో తలపడుతుంది. స్కాట్లాండ్ చివరి గ్రూప్ మ్యాచ్ ఫిబ్రవరి 17న నేపాల్‌తో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది.
READ ALSO: RK Roja: సీఎం చంద్రబాబు అబద్ధాలు వినలేక.. నగరిలో ప్రజలు పారిపోయారు!
2026 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ఫిబ్రవరి 7వ తేదీ శనివారం ప్రారంభమవుతుంది. మొదటి రోజున క్రికెట్ అభిమానులు మూడు హై-ప్రొఫైల్ మ్యాచ్‌లను వీక్షించనున్నారు. ఈ మ్యాచ్‌లు మూడు చారిత్రాత్మక, దిగ్గజ స్టేడియాలలో జరుగుతాయి. మొదటి రోజు అతిపెద్ద ఆకర్షణ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఉంటుంది. ఇక్కడ ఆతిథ్య భారతదేశం – యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA)తో తలపడుతుంది. సొంత గడ్డపై జరిగే ఈ పోరు టోర్నమెంట్‌కు నాంది పలుకుతుందని భావిస్తున్నారు.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే..
2026 ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ భారత్ – పాకిస్థాన్ మధ్య జరుగుతుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరుగుతుంది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ క్రికెట్‌లో అతిపెద్ద పోటీగా పరిగణిస్తారు. అలాగే ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా చూస్తుంది. ఈసారి ఈ మ్యాచ్ ప్రాముఖ్యత మరింత పెరిగింది. కొనసాగుతున్న ఆఫ్-ఫీల్డ్ ఉద్రిక్తతలు, ఇటీవలి వివాదాలు, రాజకీయ నేపథ్యం ఈ మ్యాచ్‌కు అదనపు ఉత్సాహం, ఒత్తిడిని తెచ్చాయి. అలాగే ఈ T20 ప్రపంచ కప్‌లో స్కాట్లాండ్ చేరిక గ్రూప్ Cకి కొత్త ఉత్సాహాన్ని అందించింది. ఈ జట్టుకు మరోసారి ప్రపంచ వేదికపై తనను తాను నిరూపించుకోవడానికి ఒక సువర్ణావకాశం లభించినట్లు అయ్యింది.
2026 T20 ప్రపంచ కప్‌లో స్కాట్లాండ్ గ్రూప్ మ్యాచ్‌లు:
ఫిబ్రవరి 7, vs వెస్టిండీస్, కోల్‌కతా
ఫిబ్రవరి 9, vs ఇటలీ, కోల్‌కతా
ఫిబ్రవరి 14, vs ఇంగ్లాండ్, కోల్‌కతా
ఫిబ్రవరి 17, vs నేపాల్, ముంబై.
T20 ప్రపంచ కప్ 2026 పూర్తి షెడ్యూల్
ఫిబ్రవరి 7, 2026, ఉదయం 11:00: పాకిస్థాన్ vs నెదర్లాండ్స్, SSC, కొలంబో
ఫిబ్రవరి 7, 2026, మధ్యాహ్నం 3:00: వెస్టిండీస్ vs స్కాట్లాండ్, కోల్‌కతా
ఫిబ్రవరి 7, 2026, సాయంత్రం 7:00: ఇండియా vs USA, ముంబై
ఫిబ్రవరి 8, 2026, ఉదయం 11:00: న్యూజిలాండ్ vs ఆఫ్ఘనిస్థాన్, చెన్నై.
ఫిబ్రవరి 8, 2026, మధ్యాహ్నం 3:00: ఇంగ్లాండ్ vs నేపాల్, ముంబై.
ఫిబ్రవరి 8, 2026, సాయంత్రం 7:00: శ్రీలంక vs ఐర్లాండ్, ప్రేమదాస స్టేడియం, కొలంబో.
ఫిబ్రవరి 9, 2026, ఉదయం 11:00: స్కాట్లాండ్ vs ఇటలీ, కోల్‌కతా
ఫిబ్రవరి 9, 2026, మధ్యాహ్నం 3:00: జింబాబ్వే vs ఒమన్, SSC, కొలంబో
ఫిబ్రవరి 9, 2026, సాయంత్రం 7:00: దక్షిణాఫ్రికా vs కెనడా, అహ్మదాబాద్
ఫిబ్రవరి 10, 2026, ఉదయం 11:00: నెదర్లాండ్స్ vs నమీబియా, ఢిల్లీ
ఫిబ్రవరి 10, 2026, మధ్యాహ్నం 3:00: న్యూజిలాండ్ vs యుఎఇ, చెన్నై
ఫిబ్రవరి 10, 2026, సాయంత్రం 7:00: పాకిస్థాన్ vs యుఎస్ఎ, ఎస్ఎస్సి, కొలంబో
ఫిబ్రవరి 11, 2026, ఉదయం 11:00: దక్షిణాఫ్రికా vs ఆఫ్ఘనిస్థాన్, అహ్మదాబాద్.
ఫిబ్రవరి 11, 2026, మధ్యాహ్నం 3:00: ఆస్ట్రేలియా vs ఐర్లాండ్, ప్రేమదాస, కొలంబో.
ఫిబ్రవరి 11, 2026, సాయంత్రం 7:00: ఇంగ్లాండ్ vs వెస్టిండీస్, ముంబై.
ఫిబ్రవరి 12, 2026, ఉదయం 11:00: శ్రీలంక vs. ఒమన్, కాండీ.
ఫిబ్రవరి 12, 2026, మధ్యాహ్నం 3:00: నేపాల్ vs. ఇటలీ, ముంబై.
ఫిబ్రవరి 12, 2026, సాయంత్రం 7:00: భారతదేశం vs. నమీబియా, ఢిల్లీ.
ఫిబ్రవరి 13, 2026, ఉదయం 11:00: ఆస్ట్రేలియా vs జింబాబ్వే. ప్రేమదాస. కొలంబో.
ఫిబ్రవరి 13, 2026, మధ్యాహ్నం 3:00: కెనడా vs యుఎఇ. ఢిల్లీ.
ఫిబ్రవరి 13, 2026, సాయంత్రం 7:00: యుఎస్ఎ vs నెదర్లాండ్స్. చెన్నై.
ఫిబ్రవరి 14, 2026, ఉదయం 11:00: ఐర్లాండ్ vs. ఒమన్. SSC, కొలంబో.
ఫిబ్రవరి 14, 2026, మధ్యాహ్నం 3:00: ఇంగ్లాండ్ vs. స్కాట్లాండ్. కోల్‌కతా.
ఫిబ్రవరి 14, 2026, సాయంత్రం 7:00: న్యూజిలాండ్ vs. దక్షిణాఫ్రికా. అహ్మదాబాద్.
ఫిబ్రవరి 15, 2026, ఉదయం 11:00: వెస్టిండీస్ vs నేపాల్, ముంబై.
ఫిబ్రవరి 15, 2026, మధ్యాహ్నం 3:00: USA vs నమీబియా, చెన్నై.
ఫిబ్రవరి 15, 2026, సాయంత్రం 7:00: భారతదేశం vs పాకిస్తాన్, ప్రేమదాస, కొలంబో.
ఫిబ్రవరి 16, 2026, ఉదయం 11:00: ఆఫ్ఘనిస్థాన్ vs యుఎఇ, ఢిల్లీ.
ఫిబ్రవరి 16, 2026, మధ్యాహ్నం 3:00: ఇంగ్లాండ్ vs ఇటలీ, కోల్‌కతా.
ఫిబ్రవరి 16, 2026, సాయంత్రం 7:00: ఆస్ట్రేలియా vs శ్రీలంక, కాండీ.
ఫిబ్రవరి 17, 2026, ఉదయం 11:00: న్యూజిలాండ్ vs. కెనడా, చెన్నై.
ఫిబ్రవరి 17, 2026, మధ్యాహ్నం 3:00: ఐర్లాండ్ vs. జింబాబ్వే, కాండీ.
ఫిబ్రవరి 17, 2026, సాయంత్రం 7:00: స్కాట్లాండ్ vs. నేపాల్, ముంబై.
ఫిబ్రవరి 18, 2026, ఉదయం 11:00: దక్షిణాఫ్రికా vs యుఎఇ, ఢిల్లీ;
ఫిబ్రవరి 18, 2026, మధ్యాహ్నం 3:00: పాకిస్థాన్ vs నమీబియా, SSC, కొలంబో;
ఫిబ్రవరి 18, 2026, సాయంత్రం 7:00: భారతదేశం vs నెదర్లాండ్స్, అహ్మదాబాద్
ఫిబ్రవరి 19, 2026, ఉదయం 11:00: వెస్టిండీస్ vs ఇటలీ, కోల్‌కతా
ఫిబ్రవరి 19, 2026, మధ్యాహ్నం 3:00: శ్రీలంక vs జింబాబ్వే, ప్రేమదాస, కొలంబో
ఫిబ్రవరి 19, 2026, సాయంత్రం 7:00: ఆఫ్ఘనిస్థాన్ vs కెనడా, చెన్నై
ఫిబ్రవరి 20, 2026, సాయంత్రం 7:00: ఆస్ట్రేలియా vs ఒమన్, కాండీ
ఫిబ్రవరి 20, 2026, సాయంత్రం 7:00: ఆస్ట్రేలియా vs ఒమన్, కాండీ
దీని తర్వాత, సూపర్ 8, సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి.
READ ALSO: Kishore Tirumala: కీర్తి సురేశ్ కోసం ఆ స్టార్ హీరోయిన్‌కు మస్కా కొట్టాను : డైరెక్టర్ కిషోర్ తిరుమల