AP Assembly 2025: త్వరలో క్యూఆర్ కోడ్‌తో రేషన్ కార్డులు ఇస్తాం: మంత్రి నాదెండ్ల
- ఆరవ రోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సభ్యుల ప్రశ్నలు
- సమాధానం చెప్పిన మినిస్టర్ నాదెండ్ల మనోహర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరవ రోజు కొనసాగుతున్నాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై శాసన సభలో సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్‌ను సభ్యులు ప్రశ్నలు అడిగారు. అక్రమార్కులపై ఏ మేరకు చర్యలు తీసుకుంటున్నారని సభ్యులు అడగగా.. మంత్రి నాదెండ్ల సమాధానం చెప్పారు. గత ప్రభుత్వం వ్యవస్థీకృతంగా పీడీఎస్ రైస్ అంటే.. స్మగ్లింగ్ రైస్‌గా మార్చేశారన్నారు. అక్రమ రవాణా అరికట్టడానికి సివిల్ సప్లైస్ చట్టాలు, పీడీ యాక్టులలో సవరణలు తెచ్చి చట్టాలలో మార్పులు తెచ్చామన్నారు. త్వరలో క్యూఆర్ కోడ్‌తో రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి చెప్పారు.
‘రేషన్ బియ్యం కేజీకి 46.10 రూపాయలు ఖర్చు చేస్తున్నాం. 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పీడీఎస్ రైస్ కోసం వినియోగిస్తున్నాము. గత ప్రభుత్వం వ్యవస్థీకృతంగా పీడీఎస్ రైస్ అంటే స్మగ్లింగ్ రైస్‌గా మార్చేశారు. అరికట్టడానికి సివిల్ సప్లైస్ చట్టాలు, పీడీ యాక్టులలో సవరణలు తెచ్చి చట్టాలలో మార్పులు తెచ్చాం. కాకినాడ పోర్టులో 50 వేల మెట్రిక్ టన్నులు సీజ్ చేసి.. 25 మెట్రిక్ టన్నులు పీడీఎస్ రైస్‌గా గుర్తించాం. త్వరలో క్యూఆర్ కోడ్‌తో రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. ఈకేవైసీ, ఏఐ కెమెరాల సహాయంతో అక్రమ రవాణాను అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నాం’ అని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
Also Read
‘గత ఐదేళ్ల కాలంలో రేషన్ బియ్యానికి సంబంధించిన లెక్కలు తీస్తున్నాం. పూర్తి వివరాలు రావాల్సిన అవసరం ఉంది. మచిలీపట్నం గోడౌన్లతో పాటు రాష్ట్రంలో కాకినాడ, బేతంచర్ల గోడౌన్లకు సంబంధించి తనిఖీలు జరుగుతున్నాయి. మచిలీపట్నం జెఎస్ వేర్ హౌస్లో తనిఖీ జరిగింది. వారి దగ్గర నుంచి ఇప్పటికే కోటి 70 లక్షల వరకు రికవరీ జరిగింది. ఇంకా అధికారులు విచారణ చేస్తున్నారు. సభ్యలు అడిగిన అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకుంటాం. త్వరలో అన్ని విషయాలు బయటికి వస్తాయి’ అని మంత్రి నాదెండ్ల చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Akhil Akkineni: ‘లెనిన్’తో బ్లాక్‌బస్టర్.. ఇక అఖిల్ టార్గెట్ మరింత పెద్దది.. నెక్స్ట్ మూవీపైనే ఫోకస్!
-
Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్‌లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..