Rahul Gandhi: ‘‘ఢిల్లీ ర్యాలీకి ప్రజలు రాకుండా అడ్డంకులు’’.. కేంద్రంపై రాహుల్ ఆరోపణలు..
- ఢిల్లీకి ప్రజలు రాకుండా అమిత్ షా అడ్డుకుంటున్నారు..
- రాంలీలా మైదాన్ ర్యాలీ ప్రతిపక్షాల ఉద్యమం..
- ఓట్లు కోల్పోతున్నామనే బాధ ప్రజల్లో ఉంది..
- కేంద్రంపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ప్రతిపక్ష ఇండియా కూటమి నవంబర్ 1న భారీ ర్యాలీని తలపెట్టింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. దాదాపుగా 10 లక్షల మంది ర్యాలీకి హాజరవుతారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే, ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వస్తున్న ప్రజల్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాహుల్ ఆరోపణలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, సామాన్య ప్రజలు రాకుండా అడ్డంకులు సృష్టి్స్తున్నారని పేర్కొన్నారు.
రాంలీలా మైదాన్‌లో జరిగే కార్యక్రమానికి ఎంతమంది వస్తారు, వారిలో ఎంతమందిని అడ్డుకుంటున్నారో గమనిస్తే దేశంలో ప్రస్తుతం ఏం జరుగుతుందో అర్థమవుతుందని ఆయన అన్నారు. కోట్లాది మంది ఓటు హక్కును కోల్పుతున్నారనే ఆవేదన ప్రజల్లో ఉందని, దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని చెప్పారు. అదానీ, అంబానీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌లకు ప్రయోజనం చేకూర్చేందుకే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఇది వేర్వేరు నిరసన కార్యక్రమం కాదని, ఒకే ఉద్యమమని ఆయన అన్నారు. మొత్తం ప్రతిపక్షం ఈ పోరాటంలో పాల్గొంటుందని చెప్పారు. నిరసన తెలియజేయాలనుకునే ప్రతీ ఒక్కరూ రాంలీలా మైదాన్‌కు రావచ్చని చెప్పారు.
Also Read
- Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి.?
- Madras High Court: CJP నేత సౌరవ్ దాస్ ఎవరు.? బ్యాక్‌గ్రౌండ్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
- Indian Navy: భారత నౌకాదళంలోకి 8 కొత్త స్టెల్త్ యుద్ధనౌకలు.. రూ. 40 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
- PM Modi's Big Statement: దేశాభివృద్ధి కొంతమందికి నచ్చడం లేదు.. ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఫైర్
#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "Now you watch what happens at Ramlila Ground. You watch how many people come, and you watch how many people they manage to stop, and you will understand what is going on in this country. Huge anger, huge emotional pain, because millions of people are being disenfranchised. Their vote is being stolen from them to help Mr Adani, Mr Ambani, Mr Modi, Mr Shah, and Mr Mohan Bhagwat. As we said before, this is not multiple protests. This is one protest. The entire opposition is standing here. Anybody who wants to protest, any person, is welcome to come here. We are all standing together because we are defending the Constitution. We are defending the idea of India. We are defending the vote, which is the expression of all Indians."
— ANI (@ANI) October 30, 2026
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘‘ఢిల్లీ ర్యాలీకి ప్రజలు రాకుండా అడ్డంకులు’’.. కేంద్రంపై రాహుల్ ఆరోపణలు..
-
Under-19: అండర్-19 ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన.. జట్టులో సచిన్, ద్రవిడ్, సెహ్వాగ్ వారసులు..
-
#NBKxKoratalaSiva: ఆ వార్తలు నిజం కాదు.. తేల్చేసిన టీమ్!
-
Fire Accident: విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్‌లో అగ్నిప్రమాదం.. సీ హార్స్ జంక్షన్ సమీపంలో ఎగిసిపడుతున్న మంటలు..
-
Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి.?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!